ప్రిన్స్ కోసం ఆ స్టార్ హీరోకి నో చెప్పేసింది...

Rakul Preet Singh says sorry to mega hero

11:03 AM ON 27th August, 2016 By Mirchi Vilas

Rakul Preet Singh says sorry to mega hero

బ్యూటీ విత్ బ్రెయిన్ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే రకుల్ ప్రీత్ సింగ్ 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తో టాలీవుడ్ లోకి దూసుకు వచ్చింది. ఇక రకుల్ సినీ ప్రయాణం బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతూనే ఉంది. కుర్ర హీరోలకూ, స్టార్ హీరోలకూ మంచి ఆప్షన్ గా మారిన రకుల్ ప్రస్తుతం తన కల నెరవేరడంతో కల నెరవేరెగా.... కోరిక తీరెగా అని పాడుకుంటోంది. ఇంతకీ ఆ కల ఏమిటంటే, మహేష్ సరసన నటించడం. మహేష్ బాబు గారి సినిమాకి ఆ సినిమాకి డేట్లు అడ్జస్ట్ కావడం లేదు. ఈ రంగంలోకి వచ్చినప్పటి నుంచీ మహేష్ బాబు గారితో సినిమా చేయాలన్నది నా కోరిక. అందుకే తప్పనిసరి పరిస్థితిలో మెగా హీరో సినిమా వదులుకోవలసి వచ్చింది.

ఇదే విషయాన్ని దర్శక నిర్మాతలతో పాటు హీరోకి వివరించి చెప్పా. వారు నన్ను అర్థం చేసుకున్నారు అని రకుల్ చెప్పుకొచ్చింది. స్టార్ హీరోలందరితో ఇంకా నటించలేదని రకుల్ చెప్పింది. ఇంకా కొందరు మిగిలి ఉన్నారు. వారి నుంచి పిలుపు ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నా అని అంటోంది. ఇక మహేష్ బాబుతో చేయగానే పెళ్ళి చేసుకుంటారా అని అడిగితే, రకుల్ స్పందిస్తూ, అలా అని ఎక్కడా చెప్పలేదు. ఈ వార్త ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు. నా పెళ్ళికి ఇంకా సమయముంది. చేసుకునే ముందు అందరికీ చెప్పే చేసుకుంటా అని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: ఉదయభానుకి ఎయిడ్స్?

ఇది కూడా చదవండి: ఈ సభతో పవన్ చెప్పేదేమిటి.. సంచలన నిర్ణయంపై ఉత్కంఠ

ఇది కూడా చదవండి: కూతుళ్ళతో స్టార్ హీరో డాన్స్

English summary

Rakul Preet Singh says sorry to mega hero