కూకట్‌ పల్లిలో కూరగాయలు అమ్ముతుంది

Rakul Preet Singh selling vegetables at Kphb

05:36 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Rakul Preet Singh selling vegetables at Kphb

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు తనయ మంచు లక్ష్మీ ప్రసన్న తనదైన శైలిలో సినీ రంగంలో దూసుకుపోతుంది. అటు నటిగా, యాంకర్‌గా, నిర్మాతగా తనకంటూ ఒక స్టైల్‌ని ఏర్పరుచుకుంది. వీటితో పాటు అప్పుడప్పుడు సామాజిక సేవల పై కూడా దృష్టి పెడుతుంది. చెన్నైలో వరదలు సంభవించినప్పుడు మేము సైతం అంటూ ఒక క్యాంపేన్ ను టాలీవుడ్‌ తరపున నడపడంలో మంచు లక్ష్మీప్రసస్న కీ రోల్‌ పోషించింది. అయితే ఇప్పుడు తాజాగా జెమిని టీవి ఛ్యానల్‌ లో మేము సైతం అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ ప్రోగ్రాం హోస్ట్‌గా మంచు లక్ష్మీ ప్రసన్నను ఎంచుకున్నారు. ఈ ప్రోగ్రాంలో సెలబ్రిటీలు రకరకాల కార్యక్రమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.

ఇందులో ఒక కార్యక్రమం కోసం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మంజీరా మాల్‌ వద్ద ఉన్న కేపీహెచ్‌బీ లోని ఒక మార్కెట్‌లో కూరగాయలు అమ్ముతుంది. సమాజం కోసం చేస్తున్న ఈ కార్యక్రమంలో రకుల్‌ ఎంతో ఆసక్తిగా పాల్గొంది. ఉదయం 10 గంటలకి వచ్చి నా దగ్గర కూరగాయలు కొనుక్కోండి అంటూ రకుల్‌ ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేసింది. ఆది చూసి ఇదిగో ఇలా అభిమానులు తరలి వచ్చారు.

English summary

Heroine Rakul Preet Singh selling vegetables at Kphb vegetables market for Memu Saitham program. It will telecast in Gemini tv channel.