అలాంటి సినిమాల్లో నటించాలనుంది

Rakul Preet Singh Wants To Act In That Type Of Movies

12:34 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Rakul Preet Singh Wants To Act In That Type Of Movies

అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ వరుస విజయాలతో అగ్రనాయికల జాబితాలోకి చేరిన రకుల్‌ప్రీత్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు . అందం, అభినయం, అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడేతత్వం గల రకుల్ తాజాగా అల్లు అర్జున్ సరసన ‘సరైనోడు’ లో నటించింది, ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా, అల్లు అరవింద్‌ నిర్మాత. ఈ నెల 22న ‘సరైనోడు’ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా రకుల్‌ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా పలు విషయాలు వెల్లడించింది. అవుట్‌ అండ్‌ అవుట్‌ లవ్‌స్టోరీలతోపాటు ‘ఆషికీ’, ‘జబ్‌ వి మెట్‌’ వంటి కథల్లో నటించాలని ఉందని అంటోంది.

ఇవి కూడా చదవండి : కూతుర్ని రేప్ చేసాడని ఆ కామాంధుడు చేతులు నరికేసిన తండ్రి

'యాక్షన్ సినిమాలు, స్పోర్ట్‌ బేస్డ్‌ సినిమాలంటే చాలా ఇష్టం. ప్రయోగాత్మక చిత్రాలతోపాటు లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేయడానికి సిద్దంగా ఉన్నా. చేసిన పాత్రలే మళ్లీ చేయడం నాకు నచ్చదు. ఓ క్యారెక్టర్‌ ఎంపిక చేసుకున్నామంటే అందులో ఎగ్జైట్‌ చేసే అంశం ఉండాలి' అని ఈ అమ్మడు చెబుతోంది. ప్రస్తుతం రాంచరణ్‌తో ‘తని ఒరువన’ రీమేక్‌లో నటిస్తున్నానని చెప్పిన ఈ భామ మేలో షూటింగ్‌ కోసం కశ్మీర్‌ వెళ్తన్నామని అంది. అలాగే సాయిధరమ్‌ తేజ్‌తో ఓ సినిమా చేయబోతున్నానని , అది కూడా మే నెలలోనే ప్రారంభమవుతుందని చెప్పింది.

ఇవి కూడా చదవండి :చిరుకు షాకిచ్చిన ఉపాసన

ఇక రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఇల్లు కొన్నానని, అయితే ఈ ఇంటిని నాకెవరో కొనిచ్చారనే రూమర్స్‌ వచ్చాయని ఆమె వాపోయింది. అయితే అందులో నిజం లేదని స్పష్టం చేసింది. "ప్రతి మనిషికి నిత్య అవసరాలకు కావలసిన వాటిని సమకూర్చుకోవడం తప్పనిసరి. అందులో భాగంగా ఒక్కో రూపాయి పొగేసుకుని ఇల్లు, కారు కొనుకున్నా. ఇటీవల జిమ్‌ ఓపెన్ చేశాను. వీటి కోసం ఎంతగా కష్టపడుతున్నానో నాకు తెలుసు. అనేవాళ్ళు ఏదైనా అనేస్తారు. నేను అవన్నీ పట్టించుకోను. జిమ్‌ మొదలుపెట్టిన నెల రోజులకే 100 మంది చేరారు. ఆ బిజినెస్‌ చాలా బావుంది. ఒక్కసారి బరువు తగ్గితే ఇక బరువు పెరగరు. అదే నా జిమ్‌ స్పెషాలిటీ" అంటూ రకుల్ తనదైన స్టైల్లో చెప్పింది.

ఇవి కూడా చదవండి :

కోడిగుడ్డుతో..3 రోజుల్లో 3 కిలోలు తగ్గండి

ట్రైలర్‌ ఏడు గంటలు - సినిమా 30రొజులు

ఆ టైంలో శృంగారం చేస్తే ప్రాణానికే ప్రమాదం

English summary

Tollywood Top Heroine Rakul Preeth Singh Says That She want to act in Love Stories like Ashique, Jab we Met Movies. She opposed that the rumors on her house , she says that she purchsed that house wiht her own money and her Gym getting good response.