ఆ క్షణాలు మళ్లీరావట

Rakul Preeth Singh About Her Childhood Memories

10:05 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Rakul Preeth Singh About Her Childhood Memories

తెలుగు పరిశ్రమలో గోల్డెన లెగ్‌గా మారిన రకుతప్రీత సింగ్‌ తాజాగా ఎన్టీఅర్తో 'నాన్నకు ప్రేమతో ' చిత్రంతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున సరసన ‘సరైనోడు’లో నటిస్తోన్న రకుల్, బన్నీతో స్టెప్పులేస్తూ షూటింగ్‌తో బిజీగా గడుపుతోంది. అయితే ఖాళీ దొరికితే చాలు, చిన్ననాటి జ్ఞాపకాల్ని ఓసారి నెమరువేసుకుంటుందట. ‘‘చదువుకునే రోజుల్లో చిన్ననాటి స్నేహితులతో గడిపిన ప్రతిక్షణం నాకు గుర్తుంది. అవన్నీ మధుర జ్ఞాపకాలు. ఈ యాంత్రిక జీవితంలో ఖాళీ దొరికిన సమయంలో గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటుంటే ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది’’ అని చెప్పేస్తోంది. ‘‘గడిచిన రోజులే మంచివని పెద్దలు అంటుంటారు. నాక్కూడా అదే నిజం అనిపిస్తుంటుంది. చిన్నతనంలో స్కూల్లో చేసిన అల్లర్లు, స్నేహితులు, వాళ్లతో గడిపిన క్షణాలు, విహార యాత్రలు గుర్తొస్తే లోకమే తెలియదు. ఆ క్షణాలు మళ్లీరావు కదా అనిపిస్తుంది' అంటున్నా, సినీ పరిశ్రమ తొలినాళ్లలో కూడా మంచి జ్ఞాపకాలున్నాయని అంటోంది. నటన నేర్చుకోవడం, ఎక్కువ టేక్‌లు తీసుకోవడం వంటివి గుర్తొస్తాయట. అప్పుడు తెగ నవ్వోస్తుందట. ఇక ఇప్పుడు నటన మీద అవగాహన, అనుభవం వచ్చింది కాబట్టి ఆ పరిస్థితి లేదని అంటోంది. ఏది ఏమైనా గడిచిన క్షణాలు ఎంతో మధురమైనవి’’ కదా అని కలిసిన వాళ్లకు చెబుతోందట. అదండీ సంగతి.

English summary

Tollywood crazy heroine Rakul Preet Singh says that she think of her childhood memories and a feel awesome while she was alone.She says that those were the memorial incidents in her life.Presently she was acting with Allu Arjun in Sarainodu Movie