రకుల్‌ ను మెచ్చుకుంటున్న సినీ  జనాలు

Rakul Ready To Say Dubbing To Her Roles

06:00 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Rakul Ready To Say Dubbing To Her Roles

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమాలో హీరోయిన్ గా నటించి తన మొదటి సినిమాతోనే సూపర్‌హిట్‌ను అందుకున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌ తన తరువాత చేసిన శంఖం, పండగచేస్కో సినిమాలు సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. రకుల్‌ తాజాగా ఎన్టీఆర్‌ తో నటిస్తున్న నాన్నకు ప్రేమతో తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకోవాలని తెగ ఆత్రుతగా ఎదురు చూస్తుందట. రకుల్‌ ఆత్రుతను చూసిన దర్శకుడు సుకుమార్‌ ముందుగా కొన్ని సన్నివేశాలకు డబ్బింగ్‌ చెప్పమన్నాడట , ఆ పాత్రకు రకుల్‌ గొంతు సెట్‌ అవుతుంది అనుకుంటే మిగతా సినిమా మొత్తం రకుల్‌ డబ్బింగ్‌ చెప్పుకోవచ్చు అని సుకుమార్‌ అన్నారట. తన పాత్రకు ఇతరుల గొంతు కాకుండా తానే డబ్బింగ్‌ చెప్పుకుంటాననడంతో రకుల్‌ ను అంతా మెచ్చుకున్నారు.

English summary

Tollywood star actress Rakul Preeth Singh is ready to say dubbing in her future films.Presently Rakul was acting in nannaku prematho movie under sukumar direction.