అందుకే పరిణీతి ఔట్.. రకుల్ ఇన్

Rakul replaces Parineeti in Mahesh upcoming movie

11:55 AM ON 11th July, 2016 By Mirchi Vilas

Rakul replaces Parineeti in Mahesh upcoming  movie

ఈ మధ్య సినిమాల్లో హీరోయిన్ ఎంపిక పెద్ద సవాల్ అయిపోయింది. ముందు ఒకరిని అనుకున్నా, ఆతర్వాత ఏవో కారణాల వలన మార్చేస్తున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎ.ఆర్.మురుగదాస్ ల కాంబో లో రానున్న మూవీ విషయంలో కూడా ఇలానే జరిగిందని అంటున్నారు. బాలీవుడ్ తార పరిణీతి చోప్రా హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ఇదివరకే న్యూస్ వచ్చినా, ఆశ్చర్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె ఔట్ అయిందన్నది లేటెస్ట్ టాక్. నిజానికి ఈ మూవీకోసం మేకర్స్ ఎంతోమంది హీరోయిన్స్ ని వడపోత పోసి చివరకు పరిణీతిని సెలెక్ట్ చేశారు.

అయితే ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్ కి ఆమె ముఖం చాటేయడం, యూరప్ లో తన బాలీవుడ్ చిత్రం కోసం బిజీగా ఉన్నానంటూ సాకులు చెప్పడంతో, ఇక లాభం లేదని ఆమె స్థానే రకుల్ ప్రీత్ సింగ్ ని తీసుకున్నారట. మహేష్ మూవీ బ్రహ్మోత్సవం లో నటించే అవకాశం తనకు రాలేదని బాధ పడుతున్న రకుల్ కి ఇప్పుడిది గోల్డెన్ చాన్సే అంటున్నారు. మరి ఈమె జోడీ ఎలా ఉంటుందో చూడాలి.

ఇది కూడా చూడండి: వేడిచేయకూడని ఆహార పదార్ధాలు

ఇది కూడా చూడండి: రాత్రి పూట ఈ తప్పులు చెయ్యద్దు

ఇది కూడా చూడండి: ఇవి మీకు తెలుసా ?

English summary

Rakul replaces Parineeti in Mahesh upcoming movie