చరణ్‌ తో శైలజ

Ram Charan act with Sailaja ?

03:41 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Ram Charan act with Sailaja ?

రామ్‌ హీరోగా , కీర్తి సురేష్‌ నటించిన చిత్రం ‘ నేను శైలజ ’ తెలుగులో కీర్తి సురేష్‌ మొదటి సినిమా ఇది. ఈ సినామా కు అంతటా సానుకూల స్పందన లభించింది. ఈ సినామాలో కీర్తిసురేష్‌ తన పెర్‌ఫోర్మెన్స్‌ ద్వారా అందరినీ మెప్పించింది. కీర్తి మళయాల నటి. తన మళయాలం సినిమా గీతాంజలికి అవార్డులు గెలుచుకుంది. నేను శైలజ తెలుగులో కీర్తి మొదటి సినిమా అయినప్పుటికీ, సీనియర్‌ నటుడు నరేష్‌ కొడుకు నవీన్‌ విజయ్‌ కృష్ణతో ఇప్పుటికే ఒక సినిమా ఒప్పుకుంది. ప్రస్తుతం నేనే శైలజ సినిమా యూనిట్‌ సక్సెస్‌ టూర్స్‌లో బిజీగా వున్నారు. ప్రతిచోటా కీర్తినే ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం చాలా మంది స్టార్‌ డైరెక్టర్‌లు ఆమె నెక్ట్స్‌ సినిమాలకు కీర్తిని డిమాండ్‌ చేస్తున్నారని తెలుస్తుంది. రవితేజ రాబోయే సినిమా, రామ్‌చరణ్‌ నెక్ట్స్‌ చేస్తున్న తనే ఒరువన్‌ తెలుగు రీమేక్‌ సినిమాలలో కీర్తి నటిస్తుందిని సమాచారం. ఈ విధంగా జరిగితే కీర్తి సురేష్‌ రామ్‌ చరణ్‌ తో జతకట్టనుంది.

English summary

Sailaja impressed everyone with her performance in the role Sailaja. Keerthy is basically a Malayalam actress and is also trying her luck with Tamil films.