చెర్రీ-ఉపాసన అది కూడా కంబైన్డ్ గా...(వీడియో)

Ram Charan and Upasana combined work out in gym

12:56 PM ON 24th October, 2016 By Mirchi Vilas

Ram Charan and Upasana combined work out in gym

మెగాస్టార్ తనయుడు హీరో రామ్ చరణ్, అతని భార్య ఉపాసన కలిసి వ్యాయామశాలలో తెగ కసరత్తులు చేస్తున్నారు. తన భర్త చరణ్ తో కలిసి జిమ్ లో వ్యాయామం చేస్తున్న ఒక వీడియో ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. జంటగా వ్యాయామం చేయడమంటే నాకిష్టం. ఇప్పుడు మిస్టర్ సి(చరణ్) గోల్స్ ను సెట్ చేస్తారు, మేము తరచూ దీన్ని చేస్తూ ఉండాలని ఆశిస్తున్నా అని ఉపాసన ట్వీట్ చేసింది. ఈ వీడియోలో రామ్ చరణ్ చెవులకు హెడ్ సెట్ పెట్టుకుని చాలా సీరియస్ గా వ్యాయామం చేస్తున్నారు. చెర్రీ పక్కనే ఉపాసన కూడా వ్యాయామం సాగిస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధృవ' చిత్రంలో నటిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

English summary

Ram Charan and Upasana combined work out in gym