పవన్‌ ఐడియాని కాపీ కొడుతున్న చరణ్‌

Ram Charan Follows Pawan And Mahesh

12:36 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Ram Charan Follows Pawan And Mahesh

ఈ మధ్య మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోలు పారితోషికాలు పెంచేసి నిర్మాతలని బాగా ఇబ్బంది పెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పారితోషికం పెంచేయడమే కాకుండా ఎక్కువ బడ్జెట్‌ తోనే సినిమాలు తెరకెక్కించాలని కండీషన్లు పెడుతున్నారట. ఆ సినిమా హాట్‌ హిట్‌ అయితే పర్లేదు కానీ, ఫ్లాప్‌ అయితే మాత్రం ఆ నిర్మాతలు రోడ్డెక్కుతున్నారు. దీనితో ఇప్పుడు మన స్టార్‌ హీరోలు రెమ్యూనరేషన్‌ తగ్గించేసి సినిమా ప్రాఫిట్‌ పై కన్నేశారు. ఇంతకు ముందు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటించిన 'గోపాల గోపాల' చిత్రానికి పవన్‌ అలానే షేర్‌ తీసుకున్నాడు. ఇప్పుడు నటిస్తున్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రానికి కూడా పవన్‌ అలానే షేర్‌ తీసుకోబోతున్నాడడట. మహేష్‌ నటించిన 'శ్రీమంతుడు' చిత్రానికి కూడా షేర్‌ తీసుకున్నాడు. ఇప్పుడు నటిస్తున్న 'బ్రహ్మూెత్సవం' చిత్రానికి కూడా మహేష్‌ షేర్‌ తీసుకోబోతున్నాడు. తాజాగా వీరిద్దరి బాటలో రామ్‌ చరణ్‌ తేజ్‌ అడుగు వేస్తున్నాడు. చరణ్‌ తాజాగా నటించబోయే చిత్రం 'ధృవ'. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన 'తని ఓరువన్‌' చిత్రానికి ఇది రీమేక్‌. ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా చరణ్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రం షూటింగ్‌ రేపటి నుండి ప్రారంభం కానుంది. చరణ్‌ తన చివరి రెండు చిత్రాలు ఫ్లాప్‌ కావడంతో ఈ చిత్రం పై దృష్టి పెట్టాడు.

English summary

Recently a trend in Tollywood our star heroes have started cutting down their remuneration and instead taking a share in the film production.In Past Pawan Kalyan has done the same thing for Gopala Gopla Movie and Mahesh Baby was also taking share for his upcoming movie Brahmotsavam.Recently Mega Power Star Ram Charan was also taking Share for his upcoming film Tani Oruvan Remake.