19 కోట్లు నష్టపోయిన రామ్‌చరణ్‌!

Ram Charan loses 19 crores for Bruce Lee

03:43 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Ram Charan loses 19 crores for Bruce Lee

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ దసరాకి బ్రూస్‌లీతో మనముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహించగా ప్రముఖ కథా రచయిత కోన వెంకట్‌ కథ అందించాడు. అయితే ఎన్నో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రూస్‌లీ రామ్‌చరణ్‌ కెరీర్‌లోనే అట్టర్ఫ్లాప్గా నిలిచింది. నిన్నటి తో ఈ చిత్రం 3 సెంటర్స్‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రం ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌కి 59 కోట్లు ఖర్చు అవ్వగా, బ్రూస్‌లీ విడుదలయ్యాక 40 కోట్లు మాత్రమే కలెక్షన్లు రాబట్టి 19 కోట్లు నష్టపోయింది. ఈ చిత్రం కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు సైతం దారుణంగా నష్టపోయారు. ఇది రామ్‌చరణ్‌ కెరీర్‌లోనే కలెక్షన్ల పరంగా బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌ అని చెపుతున్నారు.

English summary

Ram Charan loses 19 crores for Bruce Lee. This movie is directed by Sreenu Vaitla.