ఆ... సెంటిమెంట్ తో ధృవ వెనక్కి?

Ram Charan Movie Dhruva Postponed to Dec 2nd

10:52 AM ON 7th September, 2016 By Mirchi Vilas

Ram Charan Movie Dhruva Postponed to Dec 2nd

సెంటిమెంట్లు అందరికీ ఉంటాయి. ఇక సినిమా వాళ్లకయితే, క్లాప్ దగ్గర నుంచి రిలీజ్ వరకూ అన్నీ సెంటిమెంట్ తో ముడిపడి వంటాయి. ఇప్పుడే ఈ సెంటిమెంటే, దసరా రేసు నుంచి రామ్ చరణ్ మూవీ ధృవ డ్రాప్ అవుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. దసరాకి ఖాయమంటూ ఓ రేంజ్ లో క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన మెగా ఫ్యాన్స్ లోని ఓ వర్గం, వున్నట్లుండి ఎందుకు వెనక్కి తగ్గింది? పైకి అరవింద్ స్వామికి హెల్త్ సరిగా లేకపోవడం వల్లే వెనక్కి తగ్గిందని మెగా క్యాంప్ నుంచి బలంగా వినిపిస్తున్న మాట. దీనికితోడు ప్రేమమ్, ఇజం, మన ఊరి రామాయణం వంటి చిత్రాలు దసరా రేసులో వున్నాయి. కానీ ఇదేంకాదని, అసలు రీజన్ వేరే అని అంటున్నారు.

నార్మల్ గా అక్టోబర్ మాసం చెర్రీకి అసలు కలిసిరాదట. గతంలో గోవిందుడు అందరివాడేలే, బ్రూస్ లీ వంటి చిత్రాలు అదే నెలలో థియేటర్ కి వచ్చినా, ఈ రెండు బాక్సాఫీసు వద్ద ఘోరంగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో అక్టోబరు కలిసిరాదన్న సెంటిమెంట్ మెగా ఫ్యామిలీని వెంటాడడంతో వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు. దీంతో ఇప్పట్లో ముహూర్తం కుదిరేలా లేదని, అందుకే డిసెంబర్ ఫస్ట్ వీక్ అయితే బాగుంటుందని అంటున్నారు. రిలీజ్ పై రేపోమాపో గీతాఆర్ట్స్ బ్యానర్ అధికారికంగా స్టేట్ మెంట్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. మెగా ఫాన్స్ మాత్రం కొంత నిరుత్సాహం పడుతున్నా , సెంటిమెంట్ ముందు ఏమి చేయలేము అన్నట్టు సర్దుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి: ఇల్లరికపు అల్లుడి లైంగిక దాడి తట్టుకోలేక భార్య ఏం చేసిందో తెలుసా

ఇవి కూడా చదవండి:ఛీ ఛీ ... ఆ ఎంపీ కాల్ బాయ్స్ తో రాసలీలలు

English summary

Mega Power Star Ram Charan was trying to get a blockbuster movie and recently he acted in a movie called Dhruva. This movie was announced that this was going to release on the eve of festival "DASARA" and now this was postponed due to some sentiment reasons.