రామ్ చరణ్ తేజ్ ప్రొడక్షన్ హౌస్ లోగో ఇదే

Ram Charan New Production House Logo

12:20 PM ON 29th April, 2016 By Mirchi Vilas

Ram Charan New Production House Logo

మెగాభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మెగా స్టార్ చిరంజీవి 150 సినిమాను ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సొంత నిర్మాణంలో నిర్మిస్తాడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమకు నాగబాబు అంజనా ప్రొడక్షన్స్, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ లాంటి ప్రముఖ సంస్థలు ఉన్నా, ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించడానికి రామ్ చరణ్ ఆసక్తి చూపించాడు . రామ్ చరణ్ ప్రారంభించిన ఈ కొత్త బ్యానర్ కు "కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ" అని పేరు కుడా పెట్టారు. హనుమంతుడి ముఖాన్ని బ్యానర్ కు లోగోగా డిజైన్ చేశారు రామ్ చరణ్ . ఈ రోజు చిరు సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య చిరు 150 వ సినిమా ఘనంగా ప్రారంభం కానుంది . ప్రస్తుతానికి సినిమాకు కత్తిలాంటోడు అనే టైటిల్ ను మార్చే యోచనలో ఉన్నారట . ఎండలు తగ్గుముఖం పట్టాకా జూన్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి , 2017 సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని భావిస్తునారట . ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి: భర్తకు బుద్ధి చెప్పమని పిలిస్తే.. నిన్నే పెళ్లాడతానన్న కౌన్సిలర్?

ఇవి కూడా చదవండి:మోహన్ బాబుకి వార్నింగ్ ఇచ్చిన ఎన్టీఆర్ ఫాన్స్

English summary

Mega Power Star Ram Charan was going to be produce most awaited film Chiranjeevi's 150 film. This movie was going to be directed by V.V.Vinayak and yesterday the logo of the Production House was released.