చిరంజీవి 'ముఠామేస్త్రీ'లో చరణ్‌??

Ram Charan Tej in Muta Mesthri remake??

05:34 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Ram Charan Tej in Muta Mesthri remake??

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో సూపర్‌ హిట్స్‌గా నిలిచిన చిత్రాలలో 'ముఠామేస్త్రీ' కూడా ఒకటి. యాక్షన్‌ డైరెక్టర్‌ ఎ. కోదండ రామిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం 1993లో రిలీజై సూపర్‌హిట్‌ అయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ రీమేక్‌ లేదా సీక్వెల్‌ చేయబోతున్నాడని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం రామ్‌చరణ్‌ కూడా ముఠామేస్త్రీ రీమేక్‌లో నటించడానికి ఇష్టపడుతున్నారని టాక్‌. దీనికి తోడు రామ్‌చరణ్‌ కూడా చాలా ఇంటర్‌వ్యూల్లో మీ ఫాదర్‌ నటించిన చిత్రాల్లో మీకు ఏది ఇష్టమని అడిగితే 'ముఠామేస్త్రీ' అని చెప్పాడు.

ముఠామేస్త్రీ రీమేక్‌ కి 'చోటామేస్త్రీ' అనే టైటిల్‌ కూడా ప్రచారం జరుగుతుంది. సంపత్‌నంది ఈ చిత్రానికి కధ కూడా సిద్ధం చేస్తున్నాడని టాక్‌. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రామ్‌చరణ్‌ ప్రస్తుతం తమిళంలో సూపర్‌ హిట్ అయిన 'తను ఓరువన్‌' చిత్రం రీమేక్‌ పైనే దృష్టి పెట్టారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రం జనవరిలో సెట్స్‌ పైకి వెళ్లనుంది.

English summary

Ram Charan Tej in Muta Mesthri remake?? The movie name titled as Chota Mesthri.