సుకుమార్‌ దర్శకత్వంలో మెగా హీరో??

Ram Charan Tej in Sukumar direction

05:23 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Ram Charan Tej in Sukumar direction

ఒక హీరో అయి ఉండి కూడా వేరే హీరోల సినిమాలను చూసి వారిని అభినందించే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది రామ్‌చరణ్‌ మాత్రమే. ఈ విషయం మరెవరో కాదు. సూపర్ స్టార్ మహేష్‌ బాబు స్వయంగా చెప్పాడు. మహేష్‌ 'శ్రీమంతుడు' సినిమా అనుకోని రీతిలో ఘనవిజయం సాధించినందుకు చరణ్‌ మహేష్‌ను పిలిచి ప్రశంసించాడట. అదే విధంగా చరణ్ 'నాన్నకు ప్రేమతో' సినిమా కూడా చూసాడు. ఈ సినిమా విజయం పై సుకుమార్‌, ఎన్టీఆర్‌ లను అభినందించాడు. ఆ సమయంలో జరిగిన చర్చలో చరణ్‌ సుకుమార్‌ తో సినిమా చేయడానికి ఆసక్తి చూసిస్తున్నాడని సమాచారం. చరణ్‌ ఒక సరైన మాస్‌ హిట్‌ ద్వారా తన ప్రతిభను చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది.

గోవిందుడు అందరివాడేలే, బ్రూస్లీ సినిమాలు చరణ్‌ కు నిరాశను మిగిల్చాయి. ఇప్పుడు చరణ్‌ 'తని ఒరువన్‌' రీమేక్‌ సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అయితే మెగా శిబిరం సుకుమార్‌ తో కలిసి ప్రయోగం చెయ్యాడానికి ఒప్పుకుంటారా అనేది చర్చగా మారింది.

English summary

Mega Hero Ram Charan Tej is interested to act in Sukumar direction. After watching Nannaku Prematho movie he want to do a movie with Sukumar.