ఎన్టీఆర్‌ నష్టాన్ని చరణ్‌ భర్తీ!

Ram Charan Tej movie in Aswini Dutt production

01:23 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Ram Charan Tej movie in Aswini Dutt production

ఒకప్పుడు అగ్ర నిర్మాణ సంస్థగా వెలిగొందిన వైజయంతీ మూవీస్‌ సంస్థ ఎంత ఖర్చుకైనా వెనుకాడేది కాదు. ఎప్పుడూ అగ్ర హీరోలతోనే సినిమాలు నిర్మించే ఈ సంస్థ ఎన్టీఆర్‌ తో మెహర్‌ రమేష్‌ తెరకెక్కించిన 'శక్తి' చిత్రాన్ని ఈ సంస్థే నిర్మించింది. అయితే ఈ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో ఈ సంస్థ నిర్మాత్‌ సి. అశ్వినీదత్‌ కి ఆర్ధికంగా చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆ నష్టాలు నుండి బయట పడేయటానికి ఎన్టీఆర్‌ తన బ్యానర్‌లో మరో సినిమాలో నటిస్తానన్నాడు. అయితే ఆ చిత్రం కార్యరూపం దాల్చలేదు. మళ్లీ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో ఎన్టీఆర్‌ నటించలేదు. అయితే ఇప్పుడు చాలా కాలం తర్వాత అశ్వినీదత్‌ ఒక చిత్రాన్ని నిర్మించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈసారి ఎన్టీఆర్‌తో కాదు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ నటించబోతున్నాడు. రామ్‌చరణ్‌ ని లాంచ్‌ చేసింది ఈ నిర్మాణ సంస్థే. ఆ కృతజ్ఞత తోనే రామ్‌ చరణ్‌ ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే రామ్‌చరణ్‌ ఎవరి దర్శకత్వంలో నటించబోతాడనేది కూడా తెలిసిపోయింది. 'భలేభలే మగాడివోయ్‌' చిత్రంతో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మారుతి ప్రస్తుతం వెంకటేష్‌తో 'బాబు బంగారం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే అదే సమయంలో మారుతి చరణ్‌ కి ఓ స్టోరీ లైన్‌ వినిపించాడట. అది నచ్చడంతో చరణ్‌ కూడా వెంటనే అంగీకరించినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధిక వివరాలు తెలియనున్నాయి.

English summary

Star Producer C. Aswini Dutt is producing a new movie with Ram Charan Tej. Few years back Aswini Dutt produced Ntr Sakthi movie. This movie is disaster at box office.