తన కొడుకుతో షూటింగ్ కి వెళ్లిన రామ్ చరణ్

Ram Charan Tej went to Dhruva shooting with his pet

03:55 PM ON 12th July, 2016 By Mirchi Vilas

Ram Charan Tej went to Dhruva shooting with his pet

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి తన కొడుకు 'బ్రాట్' అంటే చాలా ఇష్టం. ఇంతకీ బ్రాట్ అంటే ఎవరు అని అనుకుంటున్నారా? రామ్ చరణ్ తేజ్ కి ఆయన శ్రీమతి ఉపాసన ఎంతో ప్రేమగా ఇచ్చిన ఓ కుక్కపిల్ల పేరే 'బ్రాట్'. తొలి పెళ్లి రోజుని పురష్కరించుకుని ఎంతో ఖరీదైన, అరుదైన విదేశీ జాతికి చెందిన ఆ కుక్కపిల్లని ఉపాసన బహుమతిగా రామ్ చరణ్ కి ఇచ్చిందట. ఎప్పుడైతే బ్రాట్ ఇంటికొచ్చిందో అప్పట్నుంచి చరణ్ కి అదే లోకమైంది. ఎప్పుడూ తన వెంటే తిరుగుతుంటుందట. బయటికి వెళుతున్నా వెంటనే చరణ్ తోపాటే కార్లో ఎక్కి కూర్చుంటుందట. చరణ్ దానిని ఎంతో ప్రేమగా చేసుకుంటాడట, అంతే కాదు బ్రాట్ కి అన్ని తానే దగ్గరుండి చేసుకుంటాడట.

ఒక్క మాటలో చెప్పాలంటే బ్రాట్ ని చరణ్ తన కొడుకులా చూసుకుంటాడట. తాజాగా 'ధ్రువ' నైట్ షూటింగ్ కి కూడా చరణ్ తోపాటే బ్రాట్ కూడా వెళ్లిందట. రాత్రంతా నిద్రపోకుండా చరణ్ తోపాటు షూటింగ్ లో పాల్గొందట. బ్రాట్ తో షూటింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు చెర్రీ.

English summary

Ram Charan Tej went to Dhruva shooting with his pet