చెర్రీ 'ధ్రువ' ఫస్ట్ లుక్

Ram Charan Teja Dhruva movie first look

05:50 PM ON 11th May, 2016 By Mirchi Vilas

Ram Charan Teja Dhruva movie first look

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాజా చిత్రం 'ధృవ' ఫస్ట్ లుక్ బయటకొచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తని ఓరువన్’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. బ్లాక్ బ్యాక్ డ్రాప్ లో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో రామ్ చరణ్ తేజ్ కనిపిస్తున్నాడు. ధృవ టైటిల్ ను విల్లు బాణం కవర్ చేస్తూ డిజైన్ చేశారు. అయితే, ఇది అఫీషియల్ లుక్ అన్నదాని పై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు హార్స్ రైడింగ్ వంటివి రామ్ చరణ్ కసరత్తులు చేస్తున్నాడు. 'బ్రూస్ లీ' చిత్రం తరువాత చాల గ్యాప్ తీసుకున్న చరణ్.. మళ్లీ ఇప్పుడు ‘ధృవ’ సినిమా షూటింగ్ తో బిజీ అయ్యాడు.

ఇది కూడా చదవండి: పట్టపగలే పార్కులో శృంగారం చేస్తూ దొరికిపోయిన జంట(వీడియో)

ఈ సినిమాలో రామ్ చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. అందుకే దీనికి మొదట ‘రక్షక్’ అనే టైటిల్ అనుకున్నారు. కాని ధృవనే ఫైనల్ చేసారు. తమిళంలో జయం రవి హీరోగా ‘తని ఓరువన్’ ఘన విజయం సాధించింది. తమిళ వెర్షన్ లో విలన్ గా నటించిన అరవింద్ స్వామినే తెలుగులో కూడా విలన్ గా నటించనున్నాడు. హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తుండగా గీతా ఆర్ట్స్ పతాకం పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అది చేస్తూ దొరికేసిన ఎయిర్ హోస్టెస్

English summary

Ram Charan Teja Dhruva movie first look. Mega Power Star Ram Charan Teja upcoming movie Dhruva movie first look.