విడాకుల పై స్పందించిన రామ్‌చరణ్‌

Ram Charan Teja gave clarity on his divorce

03:18 PM ON 8th March, 2016 By Mirchi Vilas

Ram Charan Teja gave clarity on his divorce

మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తేజ్‌ 'చిరుత' చిత్రంతో వెండి తెరకు పరిచయమై ఆ తరువాత 'మగధీర' చిత్రంతో స్టార్‌ హీరోగా ఎదిగిన చరణ్‌ ఇంక వరుస పెట్టి సినిమాల్లో నటించారు. అయితే రామ్‌ చరణ్‌కి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుంది. వరుస ఫ్లాప్స్‌ రావడంతో ప్రస్తుతం చరణ్‌ కెరీర్‌ స్లో అయింది. ఇదిలా ఉంటే చరణ్‌ కొంతకాలం 2012లో తన చిన్ననాటి స్నేహితురాలిని ఉపాసనని ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల్లో వీరిద్దరూ విడిపోతున్నారు, విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వార్తలు పై రామ్చరణ్ దంపతలు గొంతు విప్పారు.

ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టత ఇచ్చారు. అంతేకాదు మా విడాకులకు కారణం సానియా మీర్జానే అని వచ్చిన వార్తలని కూడా ఖండించారు. సానియా మాకు మంచి స్నేహితురాలు మాత్రమే అని చరణ్‌ తెలిపాడు. నేను-ఉపాసన చాలా ఆనందంగా ఉన్నాం దయచేసి ఇలాంటి గాసిప్స్‌ను తీసుకురావొద్దని రామ్‌చరణ్‌ స్పష్టత ఇచ్చారు.

English summary

Ram Charan Teja gave clarity on his divorce. He married his childhood friend Upasana on 2012 and now they are ready to take divorce.