పాపం చరణ్ దగ్గర డబ్బుల్లేవట

Ram Charan Teja has no money to adopt villages

11:15 AM ON 16th March, 2016 By Mirchi Vilas

Ram Charan Teja has no money to adopt villages

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటించిన సూపర్‌ హిట్‌ చిత్రం 'శ్రీమంతుడు'. శ్రీమంతులు గ్రామాలని దత్తత తీసుకుంటే మన దేశంలో పేదరికమే ఉండదన్న కధాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఎంతో మంది హృదయాలను కలచివేసింది. దీనితో ఎంతో మంది సినీ తారలు, రాజకీయవేత్తలు, శ్రీమంతులు, క్రికెట్‌ స్టార్లు గ్రామాల్ని దత్తత తీసుకోవడానికి ముందకొచ్చారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్‌ చరణ్‌ తేజ్‌ ని ఒక విలేఖరి మీరు ఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నారా? అని అడగగా చరణ్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. అదేంటంటే నా దగ్గర డబ్బుల్లేవ్‌, నేను డబ్బులు బాగా సంపాదించాక అప్పుడు చూద్దాం అని చెప్పాడట.

స్టూడెంట్‌తో లేచిపోయిన టీచర్

తెలుగు టీవీ యాంకర్‌ నిరోషా హత్య? ఆత్మహత్య?

టీచర్ కు కడుపు చేసిన విద్యార్ధి

సెన్సార్‌ బోర్డు రిజెక్ట్‌ చేసిన అడల్ట్‌ సినిమాలు

దీనితో ఆ విలేఖరి షాక్‌కు గురయ్యాడు. అసలకే కోటీశ్వరుడైన చిరంజీవి తనయుడు, పైగా టాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో ఒకడు, తను తీసుకునే పారితోషికమే 15 కోట్లు పై మాటే, పైగా అపోలో హాస్పటల్స్‌ అధినేతకు అల్లుడు, వీటితో పాటు వివిధ వ్యాపారాలు చేస్తున్నాడు, త్వరలో రెండు ప్రొడక్షన్‌ బ్యానర్స్‌ని స్థాపించి తన తండ్రి చిరంజీవి నటించే 150వ చిత్రానికి స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తన తండ్రికి 30 కోట్లు పారితోషకం కూడా ఇవ్వబోతున్నాడు, ఇన్ని ఉండి కూడా డబ్బులు లేవా అని ఎంతో మంది రామ్‌ చరణ్‌ ని విమర్శిస్తున్నారు. గతంలో చిరంజీవి సొంతూరైన మొగల్తూరు గ్రామంలో అక్కడ గ్రామ పెద్దలు గ్రంధాలయం కోసమని చిరంజీవిని అక్కడ ఇల్లు(పెంకుటిల్లు) అడగగా ఇవ్వనని నిర్మోహమాటంగా చెప్పేశాడు.

ఇప్పుడు తాజాగా రామ్‌ చరణ్‌ ఇటువంటి వ్యాఖ్యలు చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

English summary

Ram Charan Teja has no money to adopt villages. He told to journalist that i don't have money to adopt villages.