రామ్ చరణ్ మీడియాకి క్షమాపణ చెప్పింది ఇందుకేనా?!

Ram Charan Teja says sorry to media

06:21 PM ON 25th August, 2016 By Mirchi Vilas

Ram Charan Teja says sorry to media

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మీడియాకి క్షమాపణ చెప్పే అంత పరిస్థితి ఏమొచ్చింది అనే దాని పై వివరాల్లోకి వెళితే.. రీసెంట్ గా చిరు 61 పుట్టిన రోజు వేడుకలో మీడియాకు అవమానం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ మీడియాని క్షమాపణ కోరారు. చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు పార్క్ హయిత్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే! అయితే ఆ వేడుకలకు మీడియాను లోపలకి రానివ్వకుండా ఆపేశారట. అయితే నిజానికి మొదట శిల్పకళా వేదిక వద్ద హాజరైన మీడియాను పార్క్ హయిత్ కు వచ్చి కవర్ చేసుకోమని చెప్పారు. అయితే వెన్యూ వద్దకు వెళ్లాక రెడ్ కార్పెట్ దాకానే మీడియాను లోపలకి రానిచ్చారు.

దాంతో మీడియా వర్గాలు చాలా అప్ సెట్ అయ్యాయి. మీడియాకు సరైన గౌరవం ఇవ్వలేదని న్యూస్ ఛానెల్స్ ని అవమానించారని తెలుసుకున్న రామ్ చరణ్ క్షమాపణ చెప్తూ ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఆయన ఈ విషయాన్ని ఓ దురదృష్టకర సంఘటనగా భావిస్తున్నామని, భవిష్యత్ లో అలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని అన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వారందరినీ ఆయన క్షమాపణ కోరారు.

1/1 Pages

English summary

Ram Charan Teja says sorry to media