గిన్నిస్ బుక్ లోకి ఎక్కనున్న రామ్ చరణ్

Ram Charan To Enter In Guinness Book Records

03:55 PM ON 25th March, 2016 By Mirchi Vilas

Ram Charan To Enter In Guinness Book Records

మెగాస్టార్ వారసుడిగా తెలుగు చలన చిత్ర సీమలో అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లోని టాప్ హీరోలలో ఒకడి గా రామ్ చరణ్ గుర్తింపు పొందాడు. తన డాన్సు , నటనలతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన రామ్ చరణ్ ప్రతి ఏటా తన పుట్టిన రోజున సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. రామ్ చరణ్ ఫాన్స్ సైతం రామ్ చరణ్ పుట్టిన రోజున అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో నిర్వహిస్తుంటారు. గత ఏడాది ఉత్తరాంధ్ర ను కుదిపేసిన హుదూద్ తుఫాన్ సమయం లో సైతం అనేక మాన్ డి మెగా అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేసారు.

ఇలా ఎప్పుడు ఏదో ఒక సేవా కార్యక్రామాలు చేసి నలుగురికి ఉపయోగపడే మెగా అభిమానులు ఇక మెగా హీరో రామ్ చరణ్ పుట్టిన రోజున చేసే హడావిడి అంతా ఇంతా కాదు. తాజాగా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చ్ 27 న ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణా లతో పాటు తెలుగు వారు ఎక్కడున్నారో అక్కడ భారి ఎత్తున మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చెయ్యనున్నారు . ఈ రక్తదాన శిబిరాలు అంటే మామూలు రేంజ్ లో కాదు గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో చేర్చే స్థాయిలో ప్లాన్ చేసారు. ఈ రక్తదాన శిబిరాల ను అందరు సహకరించాల్సిందిగా సాయిధరమ్ తేజ్ కోరుతున్న ప్రచార వీడియో ను చూడండి.

భార్యకు చెప్పకూడని విషయాలు

శృంగార శక్తిని వీటితో రెట్టింపు చేస్కోండి

సర్దార్ పై సల్మాన్ సంచలన వ్యాఖ్యలు

సర్దార్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్

English summary

Mega Power Star Ram Charan to enter into Guinness Book Of Records .On his birthday on March 27th Mega Fans was going to conduct Blood Camps in a record manner.