రాజకీయాల్లోకి రామ్‌చరణ్ ?

Ram Charan to enter in Politics

11:51 AM ON 25th February, 2016 By Mirchi Vilas

Ram Charan to enter in Politics

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ 2014లో 'జనసేన' అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే అప్పుడే తన పార్టీ ఎంట్రీ ఇవ్వడంతో పవన్‌ ఎన్నికల్లో పాల్గొనకుండా టీడిపి కి సపోర్ట్‌ చేశాడు. పవన్‌ సపోర్ట్‌తో పవన్‌ అభిమానులందరూ టీడిపి కే ఓట్లు గుద్దారు. అయితే ఇప్పుడు పవన్‌ 2019 ఎన్నికల్లో పాల్గొనబోతున్న విషయం తెలిసిందే. అందుకే పార్టీని పూర్తి బలోపేతం చెయ్యడానికి 2018 లో సినిమాలకి దూరంగా ఉండబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు పవన్‌కి అండగా మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ తేజ్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అసలు నిజానికి చరణ్‌కి సినిమాలకంటే రాజకీయాలంటే ఇష్టమని అతని స్నేహితులు, సన్నిహితులు చెప్తున్నారు. ఇటీవల జరిగిన కాపు ఉద్యమం పై కూడా చరణ్‌ ఎంతో ఆసక్తి చూపించాడని అతని సన్నిహిత వర్గాలు చెప్తున్నారు. గతంలో కూడా చరణ్‌ రాజకీయాలపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

యువత రాజకీయాల పై ఆసక్తి చూపాలని, మనదేశ కుళ్ళు రాజకీయాలని మార్చే శక్తి ఒక్క యువతకే ఉందని చరణ్‌ అప్పట్లో అన్నాడు. దీని బట్టి చూస్తే చరణ్‌ 2019 ఎన్నికల్లో బాబాయ్‌కి అండగా నిలబడబోతున్నట్లు ఇక వీరిద్దరూ 2019 ఎన్నికల్లో పాల్గొంటే టీడిపి మట్టి కరవడం ఖాయమని రాజకీయ పండితులు చెప్తున్నారు.

English summary

Pawan Kalyan has started a Political Party Named Janasena in 2014 but he supported TDP and BJP in 2014 elections.Now a news that Mega Power Star Ramcharan to give boost up to Pawan Kalyand Party he was decided to Participate in 2019 elections.