గ్యాంగ్‌లీడర్ రీమేక్ కి రెడీయా?

Ram Charan To Remake Gang Leader

10:24 AM ON 10th May, 2016 By Mirchi Vilas

Ram Charan To Remake Gang Leader

‘గ్యాంగ్‌లీడర్’ రామ్‌చరణ్ రీమేక్ చేస్తాడా? మెగా ఫ్యాన్స్ మాటేమోగానీ, చిరంజీవి అవుననే అంటున్నాడు. ఈ మూవీకి సమయం, సందర్భం ఎప్పుడు కలిసొస్తుందో తెలీదుగానీ రీమేక్ జరగడం ఖాయంగా చెబుతున్నారు. చిరు నటించిన ‘గ్యాంగ్‌లీడర్’ అప్పట్లో ఓ సంచలనం గా నిలిచి, ఎన్నో రికార్డులు బద్దలుకొట్టింది. గతం పక్కన పెడితే, ఈ మూవీ వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ చిత్రం గురించి కొన్ని విషయాలు మెగాస్టార్ బయటపెట్టాడు. ఈ మధ్యనే మూవీ చేసినట్టుగా తనకు అనిపిస్తోందన్నాడు. హీరోయిన్ విజయశాంతి ఐతే బాగుంటుందని అన్నాడని, ఫైనల్‌గా డైరెక్టర్ కూడా అదే చేశాడని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేశాడు.ఇలాంటి ఫిల్మ్‌ని చరణ్ రీమేక్ చేస్తే బాగుంటుందని మనసులో మాటను కూడా బయటపెట్టాడు. చిరు అన్నట్లు ఇప్పటికిప్పుడు కాకపోతే.. రాబోయే రోజుల్లోనైనా చెర్రీ రీమేక్ చేయడం ఖాయమని అంటున్నారు. అప్పటికే ఇప్పటికే సొసైటీలో చాలా మార్పులు చేసుకున్నాయని, ఒకవేళ రీమేక్ చేస్తే.. కంప్లీట్‌గా మార్చాల్సివుంటుందని మెగా‌ఫ్యాన్స్‌లోని మరోవర్గం చెబుతోంది. చరణ్ నటించిన ‘నాయక్’.. ఒకవిధంగా ‘గ్యాంగ్‌లీడర్’ మాదిరిగానే ఉందన్న కామెంట్లు అప్పట్లో గుప్పుమన్నాయి. మరి రీమేక్ చేస్తాడో , ఒకవేళ సీక్వెల్ గా తీస్తాడో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి:మహేష్ దత్తత వెనుక అసలు కారణం వేరే ఉందా!?

ఇవి కూడా చదవండి:రోబో 2.0 లో గ్రాఫిక్స్ కోసం 100 కోట్లు

English summary

Megastar Chiranjeevi's Ganga Leader film was completed 25 years and Chiranjeevi has remembered some memories and he said that it will be good to remake Gang Leader Movie with Ram Charan.