నయీమ్ డిజైన్ తో మరో సంచలనానికి తెర తీసిన వర్మ!

Ram Gopal Varma biopic on Nayeem

12:46 PM ON 1st September, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma biopic on Nayeem

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్... వివాదాస్పద ట్వీట్ లకు నిర్వచనం... ఇంకెవరు... ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈమధ్యే వీరప్పన్ జీవిత కధను తీసిన వర్మ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపాడు. దెయ్యం సినిమాలు, గ్యాంగ్ స్టర్ చిత్రాలతో ప్రజలను భయపెట్టాలని చూసే రామ్ గోపాల్ వర్మ తాజాగా గ్యాంగ్ స్టర్ నయీం ఆకృత్యాలను తెరపైకి ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ లో ఇటీవల పోలీసుల చేతిలో హతమైన నయీం అరాచకాలు ఒక్కొక్కటిగా బయట పడుతూ విస్తుగొలుపుతున్న సంగతి తెలిసిందే.

అయితే నయీం గురించి తాను చాలా తెలుసుకున్నానని, అతడి గురించి మాటల్లో చెప్పడం సరికాదని పేర్కొన్న రామ్ గోపాల్ వర్మ త్వరలో ఆయనపై సినిమా తీయనున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇందుకు సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్టు చేసాడు. అయితే ఇది తాను డిజైన్ చేయించింది కాదని, ఎవరో తయారుచేసిన ఈ పోస్టర్ తనకు బాగా నచ్చిందని పేర్కొన్నారు. దీనిని దగ్గరగా చూడాలని కోరారు. కాగా నయీంపై సినిమాను మూడు భాగాలుగా తీయనున్నటు వర్మ చెబుతున్నాడు.

ఇది కూడా చదవండి: 'జనతా గ్యారేజ్' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చదవండి: వజ్రోత్సవాల కంటే గ్రాండ్ గా 'మోహన్ బాబు 40 ఇయర్స్' ఈవెంట్

ఇది కూడా చదవండి: పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికను లొంగదీసుకున్నాడు.. ఆ పై..

English summary

Ram Gopal Varma biopic on Nayeem. Sensational director Ram Gopal Varma taking Gangster Nayeem life history as 3 parts.