స్టార్ల పై వర్మ మాటల తూటాలు!

Ram Gopal Varma blames film actors

05:36 PM ON 4th December, 2015 By Mirchi Vilas

Ram Gopal Varma blames film actors

గత కొద్ది రోజులుగా చెన్నైలో కురిసిన భారీ వర్షాలకి ఆ ప్రాంతమంతా ఎలా నీటి మట్టంగా మారిపోయిందో అందరికీ తెలిసిందే. ఇది చూసి తమిళ స్టార్‌ హీరోలు, టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు లక్షల రూపాయల విరాళాలు సహాయ నిధికి అందించారు. అయితే ఎప్పడూ ఎవరినీ తిట్టకుండా నిద్రపోని రామ్‌గోపాల్‌వర్మ ఈ సారి కూడా చెన్నై వరద భాధితులకు విరాళాలు ఇచ్చిన స్టార్లను దుమ్మెత్తి పోశాడు. వాళ్ల పై మాటల తూటాలు విశిరాడు. వందలవేల కోట్లు రూపాయలు ఆస్తులు ఉన్న స్టార్లు కేవలం లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు బిచ్చం వేస్తున్నారా అంటూ మాటలని సంధించాడు.

అయితే నేను ఇంత వరుకు ఎవరికీ దానం చేయలేదు నేనొక స్వార్ధపరుడిని అందుకే నేను విరాళం ఇవ్వలేదు అని చెప్పాడు. వర్మ స్టార్లును మాత్రమే కాదు ఈ విధ్వంసానికి దేవుడు కూడా కారణమని దేవుడిని సైతం తిట్టిపోశాడు. వర్షాలను దేవుడు కురిసిస్తాడు కాబట్టి ఇన్ని రోజులు దేవున్ని ప్రార్ధించిన మీరందరూ దేవుడ్ని తిట్టాలి అన్నారు. ఇక పై దేవుడ్ని నమ్మకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోండి అంటూ గీతోపదేశం చేశాడు. చెన్నై ని ఈ విధంగా చూస్తుంటే నా మనసు కరిగిపోతుంది దేవుడు సృష్టించిన ఈ భీభత్సం ముందు ప్రపంచంలో ఏ ఉగ్రవాద చర్య అయినా చిన్నదే అని దేవుడిని నానా మాటలు అన్నాడు.

అంతే కాదు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న సినిమా స్టార్లు వేలాది కోట్ల రూపాయల నష్టపోయిన చెన్నై వరద భాదితులకు 5 లక్షలు, 10 లక్షలు, 25 లక్షలు దానం చేస్తే అంత డబ్బును ఏం చేసుకోవాలో తెలీక చెన్నైవాసులు మూర్ఛపోతారని దానికంటే ఏమీ ఇవ్వకపోవడం మంచిదని సినీ స్టార్లను వెటకారం చేశాడు. చెన్నైలో కురిసిన వర్షాలకు స్టార్‌ హీరోలైన మహేష్‌బాబు, రజనీకాంత్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌ 10 లక్షలు మాత్రమే సాయంగా ప్రకటించడం గమనార్హం.

English summary

Ram Gopal Varma blames film actors because they have thousands of crores properties but they are giving 5 lakhs 10 lakhs fist to chennai victims it is very sad.