పవన్ ని చీల్చి చెండాడేసిన వర్మ

Ram Gopal Varma Comments On Pawan Kalyan

09:49 AM ON 2nd May, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma Comments On Pawan Kalyan

ఎపికి ప్రత్యేక హోదా విషయంలో బిజెపి అలా చేయదని నమ్ముతున్నా , వెంటనే హోదా ఇవ్వాలని , టీడీపీ ఎంపీలు హోదా కోసం పోరాడాలని... ప్రతిపక్ష ఎంపీలనూ కలుపుకోవాలని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుద్దులు చెప్పారు. దీంతో పవన్ పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ కేంద్రాన్ని అడుక్కోవడం మానాలంటూ భగ్గుమన్నారు.. అలా అడుక్కోవడానికి నువ్వు బెగ్గర్ సింగ్ వి కాదు -గబ్బర్ సింగ్ కావాలి అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పవన్ ను టార్గెట్ చేసి చీల్చి చెండాడేశారు.

ఇవి కూడా చదవండి:కబాలి తెలుగు టీసర్

అంతేకాదు... మొన్నటి ఎన్నికల్లో పవన్ మాటలు - ప్రచారాన్ని నమ్మి ఓట్లు వేసిన కాపులను పవన్ మోసం చేశాడంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ తీరు చూసి ఆయన అభిమానులు కూడా తట్టుకోలేక పోతున్నారని వర్మ అనేసాడు. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ కన్నా - అల్లు అర్జున్ సరైనోడు చిత్రం పెద్ద విజయం సాధించిందంటూ పవన్ ను ఏకిపడేశారు. ట్విట్టర్ లో ఘాటైన కామెంట్లు చేయడం సంచలనం రేపుతోంది. గతంలో పలుమార్లు పవన్ ను వెనకేసుకొచ్చిన వర్మ ఈసారి మాత్రం ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు. మరి దీనిపై పవన్ అభిమానులు భగ్గు మంటున్నారట.

ఇవి కూడా చదవండి:

హన్సిక పై చెయ్యి వేసిన ఆకతాయి

బాయ్ ఫ్రెండ్ తో శ్రీదేవి కూతురు

English summary

Controversial Director Ram Gopal Varma made some Controversial Comments On Power Star Pawan Kalyan on Special Status To Andhra Pradesh . Recently Pawan Kalyan suggested TDP Government in Andhra Pradesh that Fight with All Opposition MP's on BJP Government For Special Status.RGV tweeted that Pawan Kalyan Should Be Gabbar Singh But Not Beggar Singh.