మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావించిన వర్మ

Ram Gopal Varma comments on Pawan Kalyan 3 marriages

04:40 PM ON 28th January, 2017 By Mirchi Vilas

Ram Gopal Varma comments on Pawan Kalyan 3 marriages

కౌంటర్ కి కౌంటర్ పడ్డాయి. ఎవరి మధ్యో అయితే ఎందుకు ఒకరు పవర్ స్టార్ , మరొకరు సెన్షేషన్ డైరెక్టర్. వివరాల్లోకి వెళ్తే, ‘పెళ్లైన కూతుర్ని పెట్టుకుని పోర్నోగ్రఫీ చూస్తాను అని చెప్పే వర్మ గురించి నేను ఏమి మాట్లాడేది. ఒకరోజు నన్ను ఎత్తొచ్చు, ఒకరోజు నన్ను తగ్గించొచ్చు ’అంటూ పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు.

‘ఒక అభిమానిగా పవన్‌కల్యాణ్ మీద ఎక్స్‌పెక్టేషన్స్‌తో మాట్లాడాను గానీ, ఆయన చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి, అతని వ్యక్తిగత జీవితం గురించి నేనెప్పుడూ మాట్లాడలేద’ని మొదటి ట్వీట్ చేశాడు వర్మ.

అనంతరం ‘నా జీవితం, నా లైఫ్‌స్టయిల్, నేనాలోచించే విధానం, దాక్కోకుండా, దాచుకోకుండా నా పుస్తకం ‘నా ఇష్టం’లో మొత్తం విప్పి విప్పి రాశాన’ని రెండో ట్వీట్ చేశాడు.

‘వాళ్లింట్లో వాళ్ల గురించి మాట్లాడాడని రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ను తిట్టారు. మరి, వాళ్లు వేరే ఇంట్లో వాళ్ల గురించి మాట్లాడొచ్చా? ఇదేనా వికాసం’ అని మూడోసారి ట్వీటాడు. భవిష్యత్తులో మరిన్ని ట్వీట్లు పేలనున్నాయో.

ఇది కూడా చూడండి: 4 రోజుల్లో బరువు తగ్గడానికి సూపర్ చిట్కా

ఇది కూడా చూడండి: పేరులోని మొదటి అక్షరం తో మీరెలాంటివారో తెలుసుకోవచ్చిలా

English summary

Ram Gopal Varma tweets soon after pawan kalyan comments on him. he tweets he never spoke about pawan three marriages.