రజనీతో సినిమా చేస్తే చంపేస్తారన్న వర్మ

Ram Gopal Varma Comments On Rajinikanth

11:57 AM ON 20th April, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma Comments On Rajinikanth

ఎప్పుడూ ఏదో వివాదంలో వుండే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో గిల్లి కజ్జాలు సాగించాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీఫ్యాన్స్ తో ఢీకొంటున్నాడు. రజనీ తో సినిమా చేస్తే అతని ఫ్యాన్స్ తనను చంపేస్తారంటూ తాజాగా ట్వీటిచ్చాడు. తాను రజనీ పై చేసిన వ్యాఖ్యలను ఆయన ఫ్యాన్స్ అపార్థం చేసుకున్నారని చెప్పుకొచ్చాడు. ఇంతకీ రజనీ ని వర్మ ఏమన్నాడని ఇంత రాద్దాంతం అంటారా.. రజనీ గురించి వర్మ ఏమన్నాడు..అసలీ గొడవేంటి అంటే.. రోబో2.0 సినిమాలో రజనీతో హీరోయిన్ గా అమీజాక్సన్ నటిస్తోంది.

ఇవి కూడా చదవండి : విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్

దీంతో రజనీతో దిగిన సెల్ఫీని అమీ ట్వీట్ చేసింది. అంతే ఈ ఫొటో చూసి వర్మ రెచ్చిపోయాడు. రజనీ చూసేందుకు అందవిహీనంగా ఉంటారని, కనీసం సిక్స్ ప్యాక్ కూడా లేదు. కండలు తిరిగిన బాడీ లేదు. డ్యాన్స్ చేయడం రాదు. ఇలాంటి వ్యక్తిని ఇంతమంది దేవుడిగా అభిమానించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి వ్యక్తులే హీరోలకి ఉండాల్సిన అందమైన లుక్స్ ని నాశనం చేస్తున్నారంటూ పేలిపోయాడు. ఇదే రజనీ ఫ్యాన్స్ కు మంటెత్తిపోవడానికి కారణమైంది. ఇదిలా ఉంటే, కోలీవుడ్ లో తన ఉనికిని చాటుకునేందుకే వర్మ అతిపెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రజనీతో పెట్టుకున్నా డని మరికొందరు అంటున్నారు.

ఇవి కూడా చదవండి :

సంగీతానికి థమన్ గుడ్ బై!

రమ్యకృష్ణతో గొడవ పెట్టుకున్న నారా రోహిత్!

బాహుబలి మర్డర్ మిస్టరీ విలువ 150 కోట్లు

English summary

Controversial Director Ram Gopal Varma made some controversial comments on Super Star Rajinikanth. Varma Said that Rajini has no six pack , no glow in his face but he was super star. This comments made rajinikanth fans angry and they were firing with their tweets on Ram Gopal Varma.