మెగా వెర్సస్ వర్మ ... రచ్చ రచ్చ

Ram Gopal Varma comments on Varun Tej

06:43 PM ON 30th January, 2017 By Mirchi Vilas

Ram Gopal Varma comments on Varun Tej

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా మెగా ఫ్యామిలీపై చేస్తున్న వ్యాఖ్యలు, అందుకు మెగా బ్రదర్ నాగబాబు ఇస్తున్న కౌంటర్ ఇలా చూస్తుంటే పెద్ద రచ్చ అవుతోంది. వాస్తవానికి ఖైదీ నెంబర్ 150 ప్రి రిలీజ్ ఫంక్షన్ లో వర్మపై నాగబాబు కొన్ని వ్యాఖ్యలు చేయడం, అందుకు వర్మ వరుస ట్వీట్లతో నాగబాబుపై విరుచుకుపడటం తెల్సిందే.

వర్మను కావాలనే అన్నాడట...

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. తాను ఆరోజు కావాలనే మాట్లాడినట్టు, తమ మీద పలువురు రాళ్లు వేసినప్పుడు తాము కూడా ఒక రాయి వేయాలని లేకపోతే అది తప్పు అవుతుందని, తన అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ ను ఎవరైనా అంటే తాను ఇలానే స్పందిస్తానని చెప్పుకొచ్చాడు. వర్మ చాలా గొప్ప దర్శకులని, తెలుగువారి సత్తాను ముంబైలో చాటిచెప్పి, ఉత్తర భారతీయులకు ఒక గొప్ప పాఠం నేర్పాడని అన్నారు. అయితే గత ఐదారేళ్ల నుంచి ఆయన మెగా ఫ్యామిలీని కెలుకుతుండటం చేశారని అన్నారు. గబ్బర్ సింగ్ కాస్త బెగ్గర్ సింగ్ అయిందని అనడం తప్పు అని అన్నారు. చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ ఈ గెటప్ ను జేమ్స్ కామరూన్ చూస్తే ఆశ్చర్యపోతాడని, వెటకారం చేయడం సరికాదని నాగబాబు అన్నాడు. . తమ ముగ్గురు అన్నదమ్ముల్లో వర్మ గారిని ఎవరూ, ఎప్పుడూ ఏమీ అనలేదన్నాడు. ఆయన అందరినీ అలానే అంటారని తెలుసని, కానీ తాము కామ్ గా ఎందుకు ఉండాలని ప్రశ్నించారు నాగబాబు. ఆయనకు ఆ రేంజ్ లో సమాధానం చెబితే గానీ ఆనదని తనకు అర్ధమవ్వడం వల్లే అలా చేశానని అన్నారు. తన అన్న చిరంజీవిని ఏమైనా అంటే తాను బ్యాలెన్స్ కోల్పోతానని, అది తన వీక్ పాయింట్ అని అన్నారు నాగబాబు.

వరుణ్ పై వ్యాఖ్యలకు సెటైర్ ...

కాగా వరుణ్ తేజ్ కి సలహా మాదిరిగా తనపై వర్మ చేసిన వ్యాఖ్యలకు నాగబాబు స్పందిస్తూ, ఇది సంతోషమేన న్నాడు. ఎందుకంటే వర్మ ఒక చిన్న పిల్లాడిలా మాట్లాడారని నవ్వుతూ నాగబాబు అన్నాడు. వరుణ్ నువ్వు మీ నాన్న మాటలు వినకని, అలా చేస్తే దెబ్బతింటావని తన కొడుకు వరుణ్ కు సలహా ఇచ్చారని, నిజానికి . తనన్న మాటల తర్వాత వర్మ బ్యాలెన్స్ కోల్పోయి, చిన్న పిల్లాడిలా స్పందించారన్నారు. అయితే తాను అనవసరంగా ఆయనను టచ్ చేసి బాధపెట్టినట్టు ఫీలయ్యానని నాగబాబు చెప్పాడు.. నిజానికి వరుణ్ కు తాను సలహాలివ్వనని, కానీ ఏదైనా అడిగితే తన అభిప్రాయాన్ని మాత్రమే చెబుతానని నాగబాబు అన్నాడు.

ఇది కూడా చూడండి: పెళ్ళికొడుకు లేడు ... అయినా పెళ్లయింది... ఎలా ?

ఇది కూడా చూడండి: రోడ్డెక్కిన అడవి రాజులు - ఎందుకో తెలుసా

English summary

Ram Gopal Varma had commented Varun Tej on twitter mega brother Nagababu responded on his comments.