'యామి' అందం మీద పడ్డ వర్మ

Ram Gopal Varma comments on Yami Gautam's beauty

05:00 PM ON 14th September, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma comments on Yami Gautam's beauty

అస్తమానూ ఏదో ఒక సాకుతో ట్విట్టర్లోకి వచ్చి, ఎవరో ఒకరిని గిల్లితే గానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు రోజు గడవదు. ఇక 'ట్విట్ట'డానికి వర్మకు ఏ విషయం దొరకనట్టుంది. అందుకే యామీ గౌతమ్ అందం మీద పడ్డాడు. దాంతో ఇప్పుడు అందరికీ యామీ అందం మీద పెద్ద అనుమానమే వస్తోంది. అసలు సంగతేమిటంటే... గత కొన్ని సంవత్సరాలుగా యామి ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చేస్తోంది. ఇంతవరకూ ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు కానీ, మొన్న రాంగోపాల్ వర్మకి మాత్రం ఆ అనుమానం వచ్చేసిందట! ఆ యాడ్ లో యామీ ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే తెల్లగా మెరిసిపోతారని చెబుతూ, తను కూడా అది వాడిన తరువాతే అందంగా ఉన్నానన్న సంగతి చెబుతుంది. ఈ యాడ్ చూసిన వారు క్యాజువల్ గా తీసుకున్నా వర్మ తీసుకోలేకపోయాడు.

అందుకే యామీ మీద ప్రశ్నల అస్త్రం సంధించాడు. యామీ అంతకు ముందు అందంగా లేదా? ఆ క్రీమ్ రాసుకున్న తరువాత అందంగా తయారైందా? అయితే ఆ క్రీమ్ రాసుకున్న వారందరూ యామీ అంత అందంగా తయారవుతారా? ఇలాంటి ప్రశ్నలను ట్విట్టర్ లో సంధించేశాడు. దాంతో తన పనైపోయింది అనుకున్నాడే తప్ప యామీ ఎంత ఇబ్బంది పడుతుందో ఊహించలేదని యామీ సన్నిహితులు అంటున్నారు. వర్మ ట్వీట్ చూసిన తరువాత తను అందగత్తేనా? కాదా? అన్న అనుమానం యామీకే కలిగిందట! మొత్తానికి వర్మ ఒక్క ట్వీట్ తో అందరినీ డైలమాలో పడేశాడు అని సినీ జనాలు అంటున్నారు. అయినా ఈయన గారికి వేరే వ్యాపకం లేదా అంటూ కొందరు కామెంట్లతో కుమ్మేస్తున్నారు.

ఇది కూడా చదవండి: మన దేశంలో అత్యంత విలాసవంతమైన ట్రైన్స్ ఇవే.. విమానాలు కూడా ఈ ట్రైన్స్ ముందు వేస్టే!

ఇది కూడా చదవండి: ఈ యాప్ లో ఎవరిదైనా నెంబర్ వేస్తే చాలు.. వాళ్ళ పూర్తి డిటైల్స్ వచ్చేస్తాయి!

ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్: ముసలి నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్న అనుష్క!

English summary

Ram Gopal Varma comments on Yami Gautam's beauty. Controversy director Ram Gopal Varma tweets on Yami Gautam beauty and Yami Gautam Fair and Lovely advertisement.