బాహుబలికి అవార్డా? అంటూ వర్మ ట్వీట్

Ram Gopal Varma controversial tweets on Baahubali

10:27 AM ON 29th March, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma controversial tweets on Baahubali

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తలకెక్కె సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చివరకు జాతీయ అవార్డు గెలుచుకున్న బాహుబలిని కూడా వదలలేదు, తనదైన శైలిలో ట్వీట్ లు పెట్టేసాడు. ‘బాహుబలి’కి ఉత్తమ చిత్రంగా నేషనల్ అవార్డు రావడంతో ఆ మూవీ యూనిట్ ను సినీ ప్రముఖులంతా అభినందిస్తుంటే, ఊరందరిది ఒకదారైతే, తన దారి వేరన్నట్లు తన స్టైల్లో కామెంట్ చేశాడు. బాహుబలికి జాతీయ అవార్డు రావటమేంటని ప్రశ్నించాడు. వాస్తవానికి జాతీయ అవార్డుల కమిటీకే బాహుబలి దక్కిందన్నాడు. "బాహుబలి దక్కినందుకు నేషనల్‌ అవార్డ్స్‌ కమిటీలోని జ్యూరీ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు.

ఇది కూడా చదవండి: హీరోయిన్స్ ని ఏడిపిస్తున్నాడని వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు

బాహుబలికి జాతీయ అవార్డు రాలేదు... జాతీయ అవార్డు బాహుబలిని దక్కించుకుంది. నేషనల్‌ అవార్డ్స్‌ కమిటీ బాహుబలిని గెలుచుకోవడం సంతోషంగా ఉంది. అదే విధంగా భగవంతుడు 'బాహుబలి -2' కూడా కమిటీ సభ్యులను అనుగ్రహించాలని కోరుకుంటున్నా’ అని వర్మ తన ట్వీట్స్ లో పేర్కొన్నాడు. మొత్తానికి అవార్డులు, అవార్డు కమిటీల మీదున్న కసిని వర్మ ఇలా తీర్చుకున్నాడన్నమాట వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి: హీరోయిన్స్ ని ఏడిపిస్తున్నాడని వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు

English summary

Ram Gopal Varma controversial tweets on Baahubali. Ram Gopal Varma tweeted in about National Award for Baahubali movie.