టీచర్లపై వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

Ram Gopal Varma controversy comments on teachers

06:12 PM ON 6th September, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma controversy comments on teachers

కొందరు ఎవరితో మాట పడకుండా, అనిపించుకోకుండా వుండాలని అనుకుంటారు. కొందరికి కయ్యం పెట్టుకుంటే గానీ నిద్ర పట్టదు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రెండో తరహా వ్యక్తుల్లోకి వస్తాడు. ఎందుకంటే, నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిలుస్తుంటాడు. ఎవరినీ వదలని వర్మ, ఇప్పుడు టీచర్స్ ని కూడా వదల్లేదు. ఉపాధ్యాయులంటే తనకస్సలు నచ్చదని వాళ్లవల్ల ఎంతోమంది విద్యార్థుల జీవితం నాశనం అవుతుందని, స్వయంగా తనకు టీచర్ల వల్లే బుర్ర లేకుండా పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీచర్లు తనకు చాలా బోధించారని, కానీ వాళ్ల నుంచి తాను నేర్చుకున్నదేమీ లేదని వర్మ అనేశాడు.

తానెప్పుడూ పాఠాలు చదవలేదని, కథలు, నవలలు, ఇతర పుస్తకాలు చదివేవాడినని, అందుకే తాను ఈ స్థాయికి రాగలిగానని చెప్పిన వర్మ, నేటి విద్యార్థులు కూడా గూగుల్ ఆధారంగా జ్ఞానం సంపాదించాలని ఉపాధ్యాయులతో కలిసి సమయం వృధా చేసుకోవద్దని సలహా ఇచ్చాడు. మా టీచర్లు ఎప్పుడూ నన్ను మోకాళ్ల మీద కూర్చోబెట్టేవాళ్లు, ఒక టీచర్ అయితే, డస్టర్ తో నా తలపై కొట్టింది. అప్పటినుంచి నా బుర్ర పనిచేయడం మానేసింది. నాకు మా టీచర్లంటే కోపం. దాంతో క్లాస్ లను ఎగ్గొట్టే వాడిని. ఇప్పుడు నేను మా టీచర్లకంటే ఎక్కువ సక్సెస్ సాధించా. అంతేకాదు వాళ్లకంటే నాకే ఎక్కువ తెలుసని రుజువు చేశా అంటూ వర్మ ట్వీట్ వదిలాడు.

ఇక తాను సాధారణంగా విస్కీ తాగనని చెప్పిన వర్మ, కానీ టీచర్స్ విస్కీ అంటే భలే ఇష్టం అని టీచర్లపై తన కోపాన్ని వర్మ వెళ్లగక్కాడు. ఏ అంశంపై అయినా వర్మ ఇలా కావాలని సరదాగా వ్యాఖ్యలు చేస్తుంటాడని, కానీ ప్రజలు మాత్రం వాటిని సీరియస్ గా తీసుకుంటారని వర్మకు సన్నిహితులు చెప్తుంటారు. మరి టీచర్ల పై చేసిన వ్యాఖ్యలపై కూడా వర్మకు కామెంట్స్ పడిపోతున్నాయి.

English summary

Ram Gopal Varma controversy comments on teachers.