ఫార్చ్యూన్ హోటల్ లో ఉంటా! దమ్ముంటే అక్కడకి రండి

Ram Gopal Varma Counter Warning To Vangaveeti Radha

01:14 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma Counter Warning To Vangaveeti Radha

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసాడు . తాను అసలు సిసలైన రౌడీనని పేర్కొన్న ఆయన.. పలు వ్యాఖ్యలు చేశారు. తాను రూపొందిస్తున్న ‘వంగవీటి’ చిత్రానికి సంబంధించి కొందరిని కలవటానికి విజయవాడకు వెళ్తున్నట్లు వర్మ ప్రకటించడం తెల్సిందే. అయితే తాను విజయవాడ రావటాన్ని కొందరు వ్యతిరేకిస్తూ... బెదిరింపులకు పాల్పడుతున్నారని వర్మ తాజాగా ట్వీట్‌ చేసాడు.

ఫిబ్రవరి 26న తాను విజయవాడకు వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన వర్మ తాజా ట్వీట్స్‌లో 'ఎయిర్‌కోస్టా విమానంలో వస్తున్నా రౌడీగార్లూ... విజయవాడ బందర్‌రోడ్‌ లోని ఫార్చ్యూన్‌(కాందారి) హోటల్‌కి వస్తున్నా’’ అంటూ 'తనకు వార్నింగ్‌ ఇచ్చిన వాళ్లకు ఇదే నేనిచ్చే కౌంటర్‌ వార్నింగ్‌' అని పేర్కొన్నాడు. అసలు వంగవీటి సినిమా ప్రకటన వెలువడిన నాటినుంచి వివాదం రేగుతూనే వుంది. అభిమానుల తరపున వంగవీటి రాధా వార్నింగ్ ఇవ్వడం, దీనికి వర్మ ప్రతి స్పందిస్తూ, కౌంటర్ ఇవ్వడం ఇప్పటికే జరిగిపోయాయి. తాజాగా వర్మ విజయవాడ వస్తున్నానంటూ ఎడ్రెస్ కూడా ఇవ్వడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

English summary

Controversial director Ram Gopal Varma previously gave a fitting counter warning in his usual style to Vangaveeti Radha saying Radha by saying he was a kid at the time of his father's death whereas he closely moved with Vangaveeti Ranga in those days.He now going to vijayawada and twweted that he was staying in the room number and etc.