హీరోయిన్‌ కోసం ఏడ్చిన వర్మ

Ram Gopal Varma Cries For Heroine

06:36 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Ram Gopal Varma Cries For Heroine

సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ఏం చేసినా సంచలనమే. ట్విట్టర్‌ లోని ట్వీిట్ల తో నిత్యం వార్తల్లో ఉండే రాంగోపాల్‌వర్మ ఒక హిరోయిన్‌ కోసం వెక్కి వెక్కి ఏడ్చాడట. ఈ విషయాన్ని వర్మనే స్వయంగా చెప్పడం విశేషం.

వివరాల్లోకి వెళ్తే రాంగోపాల్‌వర్మ ఇటీవల తన బయోగ్రఫీని 'గన్స్‌ అండ్‌ ధైస్‌' పేరుతో ఒక బుక్ ను విడుదల చేసాడు. ఈ పుస్తకం లో వర్మ అనేక వివాదస్పద అంశాలను పొందుపరిచాడు. వర్మ తన పుస్తకంలో తన జీవితంలో ఏడుపు ఆపుకోలేకపోయిన సందర్భాన్ని తన పుస్తకంలో వివరించాడు. హిందిలో వర్మ దర్శకత్వం వహించిన 'నిశ్శబ్ద్‌' సినిమాలో హీరోయిన్‌గా నటించిన జియాఖాన్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి షాకయ్యానని, అప్పుడు తాను ఏడుపు ఆపుకోలేక వెక్కివెక్కి ఏడ్చానని చెప్పుకొచ్చాడు.

English summary

Director ram gopal varma says that he cried for the heroine jiya khan when she was died suddenly. This was said by ram gopal varma in his book named Guns And Thighs