పవన్ తో వర్మ కటీఫ్

Ram Gopal Varma Decided To Not To Tweet On Pawan Kalyan

11:53 AM ON 12th April, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma Decided To Not To Tweet On Pawan Kalyan

ఇదేమిటి అనుకుంటున్నారా అయతే వివరాల్లోకి వెళ్ళాల్సిందే. గత కొంతకాలంగా పవన్ ఫ్యాన్స్ తో ట్విట్టర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలతో వాదాపవాదానికి దిగుతున్న సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై పవన్ కల్యాణ్ గురించి ఎలాంటి ట్వీట్ చేయనని శపథం చేశాడు. ఈ మేరకు పవన్ పై తన చివరి ట్వీట్ చేశాడు.. తాను సదుద్దేశంతో పవన్ కల్యాణ్ పై ట్వీట్లు చేస్తున్నప్పటికీ ప్రతిఒక్కరూ అపార్థం చేసుకుంటున్నారని పేర్కొన్నాడు. ఇకపై తన జీవితంలో పవన్ కల్యాణ్ గురించి ట్వీట్ అనేది చేయనని, ఇదే తన చివరి ట్వీట్ అంటూ...‘బైబై పీకే ఫ్యాన్స్’ అంటూ పవన్ ఫ్యాన్స్ కు టాటా చెప్పేశాడు వర్మ.

ఇవి కూడా చదవండి: ఫుల్‌గా తాగి రచ్చచేసిన నాగార్జున హీరోయిన్

అయితే, ఇంతకాలం పవన్ ఫ్యాన్స్ శవయాత్ర సైతం నిర్వహించేసినా తన పంథా మార్చుకోని వర్మ సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడమే ఆశ్చర్యకరం. ఇంతవరకూ వర్మ మాటతెత్తని పవన్ కళ్యాణ్ తాజాగా ప్రముఖ న్యూస్ ఛానల్ టివి9 సిఇవొ రవిప్రకాష్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలిసారిగా వర్మ గురించి నోరు విప్పాడు. ఈ నేపథ్యంలోనే వర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడా..లేక నిజంగా పవన్ ఫ్యాన్స్ మీద జాలిగా వర్మ బైబై చెప్పేశాడా అన్నది చర్చనీయం అయింది..

ఇవి కూడా చదవండి:

రైల్వే ప్రయాణికులపై పోలీసోడి దందా

రైల్వే ప్రయాణికులపై పోలీసోడి దందా

English summary

Controversial Director Ram Gopal Varma decided himself that not to tweet on Pawan Kalyan. He posted his last tweet in his twitter account that was his last tweet on Pawan Kalyan.