ఇప్పుడు 'వంగవీటి' వంతు!

Ram Gopal Varma directing another Raktha Charitra

11:40 AM ON 5th January, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma directing another Raktha Charitra

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ మరో రియల్‌ స్టోరీని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇది వరకు పరిటాల రవి-మద్దెలచెరువు సూరి మధ్య జరిగిన సంఘటనలు ఆధారంగా 'రక్తచరిత్ర' చిత్రాన్ని తెరకెక్కించారు రామ్‌గోపాల్‌ వర్మ. అయితే ఇందులో ఎవరినీ తక్కువ చేసి చూపించకుండా వర్మ చాలా జాగ్రత్తగా తెరకెక్కించాడు. ఇప్పుడు అటువంటి కథనే ఎంచుకుని కొత్త సినిమా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. వంగవీటి రంగ ఫ్యామిలీకి సంబంధించిన కథను ఆధారంగా తీసుకుని ఒక సినిమాని తెరకెక్కించనున్నానని రామ్‌ గోపాల్‌ వర్మ ప్రకటించాడు. వంగవీటి-దేవినేని మధ్య జరిగిన గొడవలు,రంగ మరణానికి సంబంధించిన విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నానని వర్మ తెలిపారు.

ఈ చిత్రానికి 'వంగవీటి' అనే టైటిల్‌ కూడా ఖరారు చేశారు. త్వరలోనే ఈ చిత్రంలో నటీనటుల్ని అధికారికంగా ప్రకటిస్తామని తెలియజేశారు.

English summary

Ram Gopal Varma movie on Vangaveeti Ranga life story.