వంగవీటి మూవీ నిజాలివే అంటున్న వర్మ

Ram Gopal Varma Enters Into Vijayawada For Vangaveeti Movie

09:32 AM ON 27th February, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma Enters Into Vijayawada For Vangaveeti Movie

'వంగవీటి మూవీతో నాకు తెలిసిన వాస్తవాలు చెబుతా. చలసాని వెంకటరత్నం జీవితచరిత్రతో మొదలై..వంగవీటి రంగా హత్యతో సినిమా ముగుస్తుంది. మూడు రోజులపాటు విజయవాడలోనే ఉంటా..కథకు సంబంధించి కీలక వ్యక్తులను కలిసి పలు విషయాలపై చర్చిస్తా. శనివారం దేవినేని నెహ్రూను కలుస్తా, వంగవీటి రత్నకుమారి, రాధాకృష్ణను కలిసేందుకు ప్రయత్నిస్తా' అని వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టిస్తున్న చలన చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చెబుతున్నాడు.

వంగవీటి సినిమా షూటింగ్‌ ముంబైలో జరుపుతాం..జూన్‌ మొదటివారంలో సినిమాను విడుదల చేస్తా . రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తే పరిస్థితే లేదు ఎటువంటి గొడవలు రాకుండానే సినిమా పూర్తిచేస్తా. వంగవీటి పేరుపై కొంతమంది నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి.. సినిమా టైటిల్‌పై ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదు' అని వర్మ స్పష్టం చేసాడు.

ఉద్రిక్త నడుమ బెజవాడలో వర్మ ...

కాగా ఉద్రిక్త నడుమ వర్మ బెజవాడ చేరుకున్నాడు. వంగవీటి మోహనరంగా జీవిత చరిత్ర ఆధారంగా ఆయన నూతనంగా ఓ సినిమా చేయనున్నట్లు వర్మ ప్రకటించడం, అయితే ఆ సినిమాను ఆపివేయాలంటూ రంగా అభిమానుల నుంచి ఆయనకు వ్యతిరేకత వ్యక్తంకావడం అందరికి తెలిసిందే. ఈ నేపధ్యంలో రంగా జీవితానికి సంబంధించిన పలు విషయాలను తెలుసుకునేందుకు వర్మ శుక్రవారం విజయవాడ చేరుకున్నారు. ముందస్తు గానే ట్విట్టర్ ద్వారా బెజవాడ చేరుతున్నట్లు , ఫలానా చోట బస చేయనున్నట్టు ప్రకటించి మరీ వచ్చాడు. అయితే గన్నవరం విమానాశ్రయంలో వర్మకు స్వాగతం పలికేందుకు ఓ పక్క అభిమానులు, వర్మను విజయవాడ రాకుండా అడ్డుకునేందుకు రంగా అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దీంతో వర్మ విమానాశ్రయంలో దిగగానే జోహార్‌ వంగవీటి మోహనరంగా అంటూ రంగా అభిమానులు బిగ్గరగా నినాదాలు చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవాడ డీసీపీ కాళిదాసు వెంకట రంగారావు అక్కడి నుంచి వర్మను విజయవాడకు పంపించారు.

వంగవీటి,దేవినేని కుటుంబాలలో ఎవరినీ తక్కువ, ఎక్కువా చేసి చూపకుండా సమపాళ్ళల్లో సినిమా తీయాల్సివుంది. అందుకే సమగ్ర అధ్యయనం కోసం బెజవాడ కు వర్మ వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రక్త చరిత్ర తీసినపుడు పరిటాల రవి , మద్దెలచెర్వు సూరి కుటుంబాలను కలుసుకున్నాడు వర్మ.

English summary

Ramgopal Varma yesterday visited Vijayawada and he said met Deveneni and Vangaveeti Family members and he says that he said that this movie will start with Chalasani Venkata Ratnam Biography and ends with Vangaveeti Ranga Murder.