వర్మ మాటలతో ఆ యాంకర్ కి దిమ్మ తిరిగింది

Ram Gopal Varma In Comedy Nights With Bacha

11:13 AM ON 23rd May, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma In Comedy Nights With Bacha

రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఎవ్వరూ ఊహించని విధంగా మాట్లాడటం.. ప్రవర్తించడం వర్మకు కొత్తేం కాదుగా. ఇక తాజాగా ఓ టీవీ షోకు ముఖ్య అతిథిగా హాజరైన వర్మ.. ఆ షో యాంకర్ కాళ్ల మీద పడబోవడం సంచలనం అయింది. . వర్మ అంత పని ఎందుకు చేశాడయ్యా అంటే.. తాను తీసిన ‘ఆగ్’ సినిమా నచ్చింది అన్నందుకేనట. ఇదంతా కలర్స్ టీవీ ఛానెల్లో ప్రసారమయ్యే ‘కామెడీ నైట్స్ విత్ బచ్చా’ కార్యక్రమంలో భాగంగా జరిగింది.

ఇవి కూడా చదవండి:తెలంగాణ అమ్మాయితో వరుణ్ తేజ్ లవ్వట

మూడేళ్ల విరామం తర్వాత బాలీవుడ్లోకి పునరాగమనం చేస్తూ వర్మ ‘వీరప్పన్’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కామెడీ నైట్స్..కార్యక్రమానికి వెళ్లాడు వర్మ. అందులో యాంకర్ మాట్లాడుతూ తనకు ‘ఆగ్’ సినిమా నచ్చిందని చెప్పింది. ఆ మాట అనగానే ఆమె కాళ్ల మీద పడబోయాడు. వర్మ తన కాళ్లు అందుకోడానికి కిందికి వంగుతుంటే యాంకర్ ఆపేసింది. ‘షోలే’కు రీమేక్ గా తీసిన ‘ఆగ్’ బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫలితం గురించి తన మీద తానే ఎన్నోసార్లు వర్మ సెటైర్లు వేసుకున్నాడు . ఈసారి ఏకంగా తన సినిమా నచ్చిందన్నందుకు కాళ్లమీద పడబోయాడు.

ఇక ఈ షోలో వర్మ తనదైన స్టయిల్లో వేసిన పంచ్ లు భలేగా పేలాయి. సర్కార్ తీసిన రాము ఏమయ్యాడు అంటే మూడేళ్ల కిందట అతణ్ని ప్రేక్షకులు మర్డర్ చేశారని ఆయన వ్యాఖ్యానించాడు. ఇక బాగా బొద్దుగా ఉన్న యాంకర్.. తాను హాట్ గా ఉన్నాను కదా అంటే.. బదులుగా ‘‘36-24-36 కొలతలు లేని అమ్మాయిల్ని నేనసలు అమ్మాయిలుగానే పరిగణించను’’ అని వర్మ వ్యాఖ్యానించడం విశేషం. మొత్తానికి వర్మ ఇలా మాట్లాడడంతో ఆ యాంకర్ కు దిమ్మదిరిగిపోయింది.

ఇవి కూడా చదవండి:క్రిస్ గేల్ కు సెక్స్ తప్ప మరో ఆలోచన ఉండదట!

ఇవి కూడా చదవండి:స్యూసైడ్ కోసం దూకి - రెండు సింహాల్ని చంపించాడు...

English summary

Controversial Director Ram Gopal Varma was made his re entry into Bollywood with Veerappan movie and recently he participated in Comedy Nights With Bacha and he shocked the anchor.