జియాఖాన్‌ చావుకి వర్మ కూడా కారణం!!

Ram Gopal Varma is another reason for Jiah Khan death

06:46 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Ram Gopal Varma is another reason for Jiah Khan death

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బాలీవుడ్‌ నటి జియాఖాన్‌ ఆత్మహత్య కేసులో రోజుకో విషయం బయటకొస్తుంది. జియాఖాన్‌ కి సూరజ్‌ పంచోలీ 2012 లో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రణయంగా మారడంతో జియాఖాన్‌ సూరజ్‌ పంచోలోకి శారీరకంగా దగ్గర అయింది. అయితే సూరజ్‌ మాత్రం జియాని వాడుకుని ఆమెను గర్భవతిని చేశాడు. ఈ విషయం బయటకు వస్తే ఎక్కడ కెరీర్‌ దెబ్బతింటుందో అని ఆమె గర్భంలో పిండాన్ని తీసేశాడని సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఇది నిజమని రుజువైతే పంచోలీకి 10 సంవత్సరాలు జైలుశిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా మరోవ్యక్తి వెలుగులోకి వచ్చాడు.

ఆ వ్యక్తి ఎవరో కాదు వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. అసలు విషయం ఏంటంటే జియాఖాన్‌ ఆత్మహత్య చేసుకునే ముందురోజు రామ్‌గోపాల్‌ వర్మని కలిసింది. అవకాశం ఇస్తానని చెప్పి రామ్‌గోపాల్‌ వర్మ తిరస్కరించడంతో ఆమె ఖుంగుపోయింది. హీరోయిన్‌గా ఇంక ఎదగలేనని భావించిన జియాఖాన్‌ బాధతో ఆత్మహత్య చేసుకుందని మరో వాదన కూడా ఉంది. ఇప్పుడు ఈ విషయం పై సీబీఐ రామ్‌గోపాల్‌ వర్మని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. అనుకోకుండా ఈ కేసులో వర్మ కూడా ఇరుక్కుపోయాడు. అయితే కొద్ది రోజుల క్రితం వర్మ రాసిన ఒక పుస్తకంలో జియాఖాన్ మరణవార్త విని జీవతంలో మొదటిసారి ఏడ్చానని రాసుకున్నాడు.

మరి ఇప్పుడు వర్మ దీని పై ఎలా స్పందిస్తాడో చూడాలి.

English summary

Ram Gopal Varma is another reason for Jiah Khan death. He is rejected to give a chance in his film.