వర్మ మూవీస్ ఇతడిని నర హంతకుడిని చేశాయి!

Ram Gopal Varma is the reason for to become psycho killer

10:55 AM ON 11th July, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma is the reason for to become psycho killer

అవునా, తప్పు చేసిన వాడు, నేరం చేసిన వాడు ఏదో కారణం తప్పనిసరిగా చెప్పే తీరతాడు. అయితే ఓ హంతకుడు మాత్రం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన కొన్ని క్రైం మూవీస్ తనను దారుణ నేరాలకు పురి గొల్పినట్టు చెప్పాడట. ఆ మూవీలు చూసిన ప్రభావంతో వెంకటేశ్వర్లు అనే ఘరానా కిల్లర్ చేసిన నేరాలు, ఘోరాలు అన్నీఇన్నీ కావట. నెల్లూరు జిల్లాను హడలెత్తించిన ఈ హంతకుడు తాను ఐదుగుర్ని హత్య చేసినట్టు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడట. దీంతో పోలీసులు షాక్ కి గురయ్యారు. ఈ ఘటనా వివరాల్లోకి వెళ్తే.. గతంలో కావలి, పెద్ద చెరుకూరులలో మూడు హత్యలు జరిగాయి.

ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్ గా వెంకటేశ్వర్లు వారి నగలు, నగదు దోచుకుని హత్య చేశాడని పోలీసుల విచారణలో తెలిసింది. ఇతగాడు సుత్తితో ఈ హత్యలన్నీ చేస్తూ వచ్చాడట. శనివారం నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో నాగేశ్వర రావు అనే ఆడిటర్ ఇంట్లో చొరబడి నగలు, నగదు దోచుకోవడమే కాక.. ఆ కుటుంబం పై వీడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో నాగేశ్వర రావు భార్య ప్రభావతి మరణించింది. ఆయన కుమారుడు, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఇతనిపై పోలీసు కేసులున్నాయి. పూజారి దంపతులను కూడా హతమార్చానని ఈ నేరగాడు ఒప్పుకున్నట్టు తెలిసింది.

సుశీలమ్మ అనే బాధిత మహిళ ఇతడిని గుర్తు పట్టిందని అంటున్నారు. కాగా ఆడిటర్ నాగేశ్వర రావు ఇంట్లో దారుణ నేరానికి పాల్పడి పారిపోతుండగా వెంకటేశ్వర్లును స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇంతకీ వర్మ చిత్రాలే ఇతడిని హత్యల వైపు మళ్ళించాయట.

English summary

Ram Gopal Varma is the reason for to become psycho killer