ఇప్పుడు దావూద్ పై పడ్డాడు

Ram Gopal Varma movie on Dawood Ibrahim

04:46 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma movie on Dawood Ibrahim

రామ్‌గోపాల్‌ వర్మ 'కిల్లింగ్‌ వీరప్పన్‌' సినిమాతో ఫార్మ్లోకి వచ్చేశాడు. ఈసారి వర్మ బాలీవుడ్‌ పై దృష్టి పెట్టాడు. తన తాజా సినిమా గురించి వర్మ క్లూ ఇచ్చేశాడు. ఈ సినిమా 'గవర్నమెంట్‌' పేరుతో, అండర్‌ వరల్డ్‌ మాఫియా నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ముంబై మాఫియాలో నిజంగా జరిగే పరిణామాల పై ఈ సినిమా తీస్తున్నాడట వర్మ. కిల్లింగ్‌ వీరప్పన్‌ సినిమాలాగే ఈ సినిమాను కూడా వాస్తవికంగా చిత్రీకరించనున్నాడు. వర్మ ఈ సినిమాలో దావూద్‌ ఇబ్రహీం, చోటారాజన్‌ల మధ్య స్నేహం, ఆ తరవాత వాళ్ళిద్దరి మధ్య వచ్చిన విభేదాలు చిత్రీకరిస్తారు. అదే విధంగా దావూద్‌కు ఉగ్రవాదులు, ఐయస్‌ఐ తో ఉన్న సంబంధాలు, అండర్‌ వరల్డ్‌ మాఫియా ముంబై రాజకీయాలకు పోలీస్‌ వ్యవస్థకు ఉన్న సంబంధాలు

అబూ సలీమ్‌, మోనికా బేడీల గురించి స్పష్టంగా చూపించనున్నాడు. ఈ విషయాన్ని వర్మ ట్విట్టర్ లో వెల్లడించాడు.

English summary

After success of Killing Veerappan movie Ram Gopal Varma gave a statement to direct his next movie on Dawood Ibrahim and Chota Rajan friendship and also clashes.