దావూద్ అంత పెద్ద తోపు ఏమి కాదు

Ram Gopal Varma New Film On Muthappa Rai

09:45 AM ON 16th April, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma New Film On Muthappa Rai

వివాదస్పద , సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ప్రాజెక్ట్ చేపట్టాడు. స్టార్టింగ్ లోనే దీనికి సంబంధించి సంచలన ప్రకటన చేసేసాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మాఫియా డాన్స్.. పాబ్లో ఎస్కోబర్, దావూద్ ఇబ్రహీమ్, అత్ కపొనే ఇలా అందరూ దిగదుడుపే అంటున్నాడు రాంగోపాల్ వర్మ. అది ఎవరి ముందంటే ముత్తప్పరాయ్ పేరు చెబుతున్నాడు. బెంగళూరు కేంద్రంగా కర్ణాటకలోనే కాక దుబాయ్ కేంద్రంగా పలు దేశాల్లో దందాలు చేసి, క్రైమ్ హిస్టరీలో తనకంటూ కొన్ని పేజీలు సృష్టించుకుని, మారిన మనిషిగా మానవసేవ చేస్తోన్న ముత్తప్పరాయ్ జీవితం ఓ మహాద్భుత మంటున్నాడు వర్మ.

రాయ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తోన్న తన రాయ్ చిత్రం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు వర్మ. కన్నడ, తెలుగు, తమిళ్, హిందీల్లో రూపొందించబోయే ఈ సినిమా ఫస్ట్ లుక్ ముత్తప్పరాయ్ పుట్టిన రోజు సందర్భంగా మే 1న రిలీజ్ చేస్తామని, స్వయంగా ముత్తప్పరాయే దాన్ని విడుదల చేస్తారని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. మొదట 'అప్ప'గా అనుకున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రకు సుదీప్ ను అనుకున్నప్పటికీ కొన్ని కారణాలవల్ల సుదీప్ స్థానంలో రాయ్ పాత్రకోసం వివేక్ ఒబెరాయ్ ని ఫైనలైజ్ చేశామని, బెంగళూరు, మంగళూరు, ముంబై, దుబాయ్, లండన్ తదితర దేశాల్లో షూటింగ్ చేస్తామని వర్మ చెబుతున్నాడు. ఈ సినిమాకి సీఆర్ మనోహర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని వర్మ తెలిపాడు.

English summary

Controversial Director Ram Gopal Varma was going to direct a new film based on the true story of Don Muthappa Rai. Vivek Oberai was going to be act in Lead Role in the movie. This movie was officially announced by Ram Gopal Varma by his Twitter. This movie first lokk was going to be released on May 1st.