వర్మ బూతు పురాణాలు ఇక నెట్టింట్లో

Ram Gopal Varma releasing adult movies in youtube

06:47 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma releasing adult movies in youtube

ఒకప్పుడు స్టార్‌ డైరెక్టర్‌ గా వెలిగిపోయిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. కానీ గత కొంత కాలంగా మంచి సినిమాలు చెయ్యడం మానేసి రాజకీయ జీవిత కథలు, దెయ్యాల కథలు అంటూ జనాన్ని తెగ ఇబ్బంది పెట్టాడు. అయితే వర్మ తన ప్రతీ చిత్రంలోనూ హీరోయిన్‌ని ఒక బూతు బొమ్మలా చూపిస్తాడు. కానీ రామ్‌గోపాల్‌ వర్మ అంత ఇష్టంగా చిత్రీకరించిన చాలా సన్నివేశాలని సెన్సార్‌ వాళ్ళు కత్తెర చేసేసే వారు. దీనితో వర్మ చాలా హర్ట్‌ అయ్యేవాడు. అయితే వర్మ ఇప్పుడు యూట్యూబ్‌లోనే ఒక ధియేటర్‌ ఓపెన్‌ చేయబోతున్నాడు. 'ఆర్జీవి టాకీస్‌' పతాకం పై ఒక ఆన్‌లైన్‌ ధియేటర్‌ని స్టార్ట్‌ చెయ్యబోతున్నాడట.

దీనిలో తన టేస్ట్‌కి తగ్గట్టుగా సినిమాలు తీసి రిలీజ్ చేస్తాడట. 'సింగిల్‌ x' అనే మొదటి చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు. దీనికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ని వర్మ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. విపరీతమైన హాట్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్‌ని చూస్తుంటే యూత్‌ పిచ్చెక్కిపోతున్నారు. అయితే ఇలాంటి పోస్టర్‌ని విడుదల చేసిన వర్మ అందరూ షాక్‌ అయ్యేలా ఒక వివరణ కూడా ఇచ్చాడు. అదేంటంటే వర్మ ఎరోటిక్‌, క్రైమ్‌, హర్రర్‌ సినిమాలు మాత్రమే ఇందులో రిలీజ్‌ చేస్తాడట. రొమాంటిక్‌ కామెడీ, అడల్డ్‌ కామెడీకి సంబంధించినవి, రిలీజ్‌ కాకుండా ఆగిపోయిన చిత్రాలు కూడా రిలీజ్‌ చెయ్యడంట.

ఎందుకంటే వర్మ లవ్‌, సెక్స్‌ అనే మాటల్ని చాలా సీరియస్‌గా తీసుకుంటాడట. వర్మ మొదటి పోస్టరే ఈ రేంజ్‌ బూతులో ఉంటే ఇక పై వచ్చేవి ఇంకెంత బూతులో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

English summary

Ram Gopal Varma releasing adult movies in youtube. His first movie Single X first look is really erotic.