వర్మకు ముద్దొచ్చిన ట్రంప్

Ram Gopal Varma says I Love You to Trump

11:11 AM ON 14th June, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma says I Love You to Trump

కొన్ని ద్రువాలు కలుస్తాయి, మరికొన్ని విడిపోతాయి.. కానీ ఈ రెండు ద్రువాలు కలిశాయి. తరచూ వివాదాస్పద పోస్టింగ్స్ తో వార్తలకెక్కే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మీద మళ్ళీ ప్రశంసల జల్లు కురిపించాడు. ఐ లవ్ యూ అని చెప్పేసాడు. ఈ మేరకు ట్వీట్ వదిలాడు. ఇంతకీ ఎందుకంటే, ఓర్లాండోలోని గే నైట్ క్లబ్ లో ఒమర్ మతీన్ అనే ఉన్మాది కాల్పులు జరిపి 50 మందిని హతమార్చిన నేపథ్యంలో వర్మ తిరిగి ట్రంప్ ని తన ట్విట్టర్ తెర పైకి తెచ్చాడు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద నిర్మూలనకు ట్రంప్ బెటర్ ఆప్షన్ అన్నాడు.

అమెరికన్లకు ఇప్పుడు రెండే అవకాశాలున్నాయి.. ఒకటి.. డొనాల్డ్ ట్రంప్ వారిని ఆశీర్వదించాలి.. లేదా అల్లా అయినా వారిని ఆదుకోవాలి అన్నాడు. టెర్రరిస్టుల అతి పెద్ద ఆయుధం సర్ ప్రైజ్ అని, ఈ విషయం ఓర్లాండో ఘటనతో నిరూపితమైందని వర్మ పేర్కొన్నాడు. ఒక చోట ఆశ్చర్య ఘటన జరుగుతుందని ఎవరూ ముందుగా ఎవరూ ఊహించలేరు.. అలా ఊహిస్తే అది సర్ ప్రైజ్ కాదు అన్నాడు. గే క్లబ్ లోని వారిని వరుసగా బాతులను కాల్చినట్టు కాల్చడం చూస్తే బాధితుల చేతిలోనూ ఆయుధాలుంటే ఈ ఘటన జరిగేది కాదన్న ట్రంప్ వ్యాఖ్యలకు బలం చేకూరుతుందని వర్మ ట్వీట్ లో పేర్కొన్నాడు.

ఒకవేళ మంచివారికి చెడు జరిగితే నువ్వు చెడ్డవారికి చెడు చేయాల్సిందే అన్న ట్రంప్ కామెంట్స్ కు హే ట్రంప్.. ఐ లవ్ యూ ఫర్ దిస్ కోట్ అని వర్మ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యల పై నెట్ లో కామెంట్స్ కూడా బానే పడుతున్నాయి.

English summary

Ram Gopal Varma says I Love You to Trump