వర్మకు దిమ్మతిరిగింది... ఫస్ట్ టైం సారీ చెప్పాడు!

Ram Gopal Varma says sorry to woman journalist

04:06 PM ON 30th May, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma says sorry to woman journalist

దూకుడుగా, వివాదస్పదంగా వెళ్తే, ఎప్పుడో అప్పుడు చిక్కుల్లో పడక తప్పదు, అందుకు పరిహారం చెల్లించుకోక తప్పదు మరి. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, వార్తలకెక్కే సంచలన దర్శకుడు, రామ్ గోపాల్ వర్మ మొదటిసారిగా ఓ మహిళా జర్నలిస్టుకు సారీ చెప్పాడు. ఇటీవల రిలీజైన తన హిందీ చిత్రం వీరప్పన్ బాగా లేదంటూ నెగెటివ్ రివ్యూ రాసిన రాయిటర్స్ వార్తా సంస్థ జర్నలిస్ట్ శిల్పా జామ్ ఖండికర్కు వర్మ అపాలజీ చెప్పాడు. ఆమె గురించి ట్విటర్లో పోస్ట్ చేసిన కామెంట్స్ను డిలిట్ చేశాడు. వీరప్పన్ మీద ఇలా రివ్యూ రాస్తావా.. నీ ముఖమంత అందంగా ఈ సినిమా ఉందంటూ ఆమె ఫోటోను కూడా పెట్టిన వర్మ.. ఆ తర్వాత సారీ చెప్పేసాడు.

2008 నుంచి బాలీవుడ్ మూవీలకు శిల్పా రివ్యూలు రాస్తోంది. నాటి ముంబై ట్రైన్ బ్లాస్ట్స్ వార్తలను, గోవాలో రాజకీయ సంక్షోభ పరిస్థితిని, రాజ్యాంగ సంక్షోభ వార్తలను కవర్ చేసింది. వీరప్పన్ మూవీ పై మిశ్రమ స్పందనలు వచ్చిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఈ తతంగం చోటు చేసుకుంది. ఇప్పటివరకూ తానెవరికీ క్షమాపణ చెప్పలేదని కానీ ఇదే మొదటిసారి అని వర్మ అంటున్నాడు.

English summary

Ram Gopal Varma says sorry to woman journalist