వంద కిస్సులకు రజనీ అర్హుడన్న వర్మ

Ram Gopal Varma sensational comments about Kabali song teaser

06:08 PM ON 18th June, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma sensational comments about Kabali song teaser

సూపర్ స్టార్ రజినీకాంత్ ను బిగ్ బి అమితాబ్ ను పోలుస్తూ, రజినీ పై సెటైర్లు వేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా రజనీ 100 ముద్దులకు అర్హుడని ప్రముఖ దర్శకుడు అన్నాడు. ఇటీవల విడుదలైన రజినీకాంత్ కబాలి చిత్రంలోని నిరుప్పు డా.. పాట టీజర్ ను చూసిన వర్మ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ రజినీకాంత్ సార్ 100 ముద్దులకు అర్హుడు, ఆయనకు నా విన్నపం ఏమిటంటే.. సబ్ టైటిలింగ్ వ్యక్తిని 1000 తన్నులు తన్నండి అని ట్వీట్ చేశాడు. దీంతోపాటు పాట టీజర్ ను లింక్ ను పోస్ట్ చేశారు. ఈ టీజర్ లో ఎలాంటి సబ్ టైటిల్స్ లేవు మరి. వర్మ ఏ ఉద్దేశంతో ఇలా ట్వీట్ చేశారో అర్థం కావడం లేదు.

సోషల్ మీడియాలో ఇలా మాట్లాడటం వర్మకి కొత్తేమీ కాదు. నిరుప్పు డా.. టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. గురువారం రాత్రి యూట్యూబ్లో విడుదలైన ఈ టీజర్ ను ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల మంది చూశారు. ఏప్రిల్ 30న విడుదలైన ఈ చిత్రం టీజర్ అత్యధిక హిట్స్ తో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

English summary

Ram Gopal Varma sensational comments about Kabali song teaser