'సర్దార్' అట్టర్ ఫ్లాప్ అవుతుందన్న వర్మ

Ram Gopal Varma sensational comments on Pawan Kalyan Sardar movie

12:47 PM ON 26th March, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma sensational comments on Pawan Kalyan Sardar movie

వివాదాల దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఏదో విషయం తో మీడియాలో హల్‌చల్‌ చేస్తూనే ఉంటాడు. ఆయన ఏం మాట్లాడినా, ఏం ట్వీట్‌ చేసినా సెన్సేషనే. ఇటీవల 'సర్దార్‌' ఆడియో రిలీజ్‌ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ విషయం పై రామ్గోపాల్ వర్మ పవన్‌ అంటే అభిమానమే అంటూనే విమర్శలు చేసాడు. పవన్‌ దేవుడు అయితే అతని అభిమానులు యాదవులు అని ఒక పక్క చెప్తూ, మహేష్‌ ఫ్యాన్స్‌ని చూసి పవన్‌ ఫ్యాన్స్‌ నేర్చుకోవాలాని చెప్పిన ఘనత వర్మకే చెల్లుతుంది. తాజాగా మరో మాట వదిలాడు వర్మ. పవన్‌ మూవీ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' తెలుగు, హిందీ భాషలలో విడుదల కానుందని తెలిసిన విషయమే.

అయితే వర్మ మాత్రం హిందీలో పవన్‌ సినిమా భారీగా విడుదల చేయాలి అనుకోకుండా అంత తెలివి తక్కువ పని ఇంకొకటి లేదని వర్మ విమర్శించాడు. అంతే కాకుండా ఇది 2016లో పెద్ద డిజాస్టర్ గా నిలుస్తుందని కూడా చెప్పాడు. దాదాపు చాలా కాలం నుండి హిట్లు కి దూరమై సతమతమవుతున్న వర్మకి ఇలా వేరే హీరోల పై కామెంట్లు చేసే హక్కు లేదని పవన్ అభిమానులు చెప్తున్నారు. అంతే కాదు ముందు నీ(వర్మ) సినిమా సంగతి చూసుకో తరువాత వేరే వాళ్ళ సినిమా ల సంగతి చూద్దుగాని అని మండిపడుతున్నారు. అయితే వర్మ ఇది వరకు మహేష్ బాబు నటించిన బిజినెస్మెన్, ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రాలు సూపర్ హిట్ గా నిలుస్తాయి అని వర్మ చెప్పాడు.

చెప్పిన విధంగానే అవి సూపర్ హిట్స్ గా నిలిచాయి. కానీ ఇప్పుడు 'సర్దార్ గబ్బర్ సింగ్' గురించి ఇలా చెప్పడానికి కారణం ఎంటంటే ఈ చిత్రం హిందీ లో అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని చెప్తున్నాడు. బాలీవుడ్ లో వర్మకి కొట్టింది పిండి, అక్కడ ఏ టైప్ సినిమా లు ఆడతాయో వర్మకి కచ్చితంగా తెలుసు, హిందీ ప్రేక్షకులు 'బాహుబలి' లాంటి అత్యున్నత విలువలు ఉన్న చిత్రాలనే ఇష్ట పడతారు. 'సర్దార్' లో అవి లేవని నాకు అర్ధమైపోయింది అని వర్మట్వీట్ చేశాడు. అయితే వర్మ చెప్పిన జోశ్యం ఫలిస్తుందో లేదో చూడాలి.

English summary

Ram Gopal Varma sensational comments on Pawan Kalyan Sardar Gabbar Singh movie. This movie will defenetly get disaster in hindi said by Ram Gopal Varma.