అ యాడ్ నా ఆగ్ సినిమా కన్నా దారుణంగా ఉందని మోడీ కి చెప్పండి

Ram Gopal Varma Sensational Comments On Swachh Bharat

04:17 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma Sensational Comments On Swachh Bharat

నిత్యం వివాదాలతో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేస్తున్న "స్వచ్చ్ భారత్" మిషన్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న స్వచ్చ్ భారత్ మిషన్ నినాదం బాగుందని ఒక పక్క పొగుడుతూనే మరో పక్క స్వచ్చ్ భారత్ మిషన్ గురించి ప్రజలను అవగాహన పరిచే యాడ్ల ఘోరంగా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతే కాకుండా స్వచ్చ్ భారత్ ప్రచార చిత్రాలలో క్రియేటివిటీ లేదని , ఇలాంటి యాడ్లు దేశాన్ని మరింత మురికిగా మారుస్తాయని , ఎవరినా నరేంద్ర మోడీ కి ఈ విషయాన్ని తెలియజెయ్యాలని , ఆ యాడ్లను చూస్తుంటే తను అమితాబ్ బచ్చన్ తో షోలే రీమేక్ గా తీసిన పరమ చెత్త సినిమా "ఆగ్" కన్నా దారుణంగా ఉందని రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు.

English summary

Controversial Director Ram Gopal Varma made a sensational comments on Swachh Bharat Mission .He says that the advertisements of Swachh Bharath mission were worse than his worst film Aag. He also said that anyone should tell Narendra Modi about this advertisements.