స్నేహితుల కన్నా శత్రువులే నయం అంటున్నాడు!

Ram Gopal Varma shocking comments on friendship day

11:27 AM ON 8th August, 2016 By Mirchi Vilas

Ram Gopal Varma shocking comments on friendship day

ఏది ఏమైనా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీరే వేరు కదా. పలు విషయాలపై డిఫరెంట్ గా స్పందిస్తూ, వివాదాలకు కారణం అవుతుంటాడు. మరి ఫ్రెండ్ షిప్ డేనాడు శత్రువుల కంటే స్నేహితులే పెద్ద ద్రోహులు... శత్రువు కనీసం ముందు నుంచి పొడిచే ప్రయత్నం చేస్తాడు. కాని స్నేహితుడు వెంటే ఉండి వెన్నుపోటు పొడుస్తాడు అంటూ వర్మ ట్వీట్ చేసాడు. అంతే కాదు, స్నేహితుడికి సాయం చేయకూడదు. అలా చే్స్తే మళ్లీ మళ్లీ వస్తుంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలో శత్రువులుంటారు. చాలా తక్కువ సందర్భాల్లో వారు స్నేహితులుగా మారుతుంటారు. అంటే స్నేహితులకంటే శత్రువులే నిజాయితీపరులు అంటూ ఈ సంచలన దర్శకుడు రాసుకొచ్చాడు.

ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా తన శత్రువులందరికీ శుభాకాంక్షలు వర్మ తెలిపారు. తనను ఇలాగే ద్వేషిస్తుండాలని, దేవుడు తన శత్రువులను కాపాడాలని కోరుకుంటున్నానని వర్మ తనదైన స్టైల్ లో వ్యాఖ్యానించాడు. మొత్తానికి దీనిపై కూడా కామెంట్స్ పడ్డాయి.

English summary

Ram Gopal Varma shocking comments on friendship day