మెగా బ్రదర్ పై రాంగోపాల్ వర్మ షాకింగ్ కామెంట్లు

Ram Gopal Varma Shocking Comments On Nagababu

12:10 PM ON 9th January, 2017 By Mirchi Vilas

Ram Gopal Varma Shocking Comments On Nagababu

మొత్తానికి ఖైదీ నెంబర్ 150 ప్రి రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి సోదరుడు నాగబాబు తనపై చేసిన వ్యాఖ్యలకు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దీటుగా స్పందించాడు. తాను చిరంజీవి కుటుంబానికి సారీ చెప్పానంటూ తెలుగులో చేసిన ట్వీట్లు తనవి కావని పేర్కొంటూ, తన ట్విటర్ అకౌంట్ ను ఎవరో ఈడియట్ హ్యక్ చేశారని వెనువెంటనే ట్వీట్ కొట్టాడు. ఇంగ్లీషులో తాను చేసే ట్వీట్లు అర్ధం చేసుకోలేకపోతే తెలుగులోకి అనువాదం చేసుకునేందుకు ఒక అనువాదకుడిని పెట్టుకోవాలని నాగబాబుకు వర్మ సూచించాడు. నాగబాబు సార్ అంటూనే నాగబాబులో 0.1 శాతం కూడా గొప్పతనం లేదని, చిరంజీవి తన గురించి నాగబాబులా చిల్లరగా కామెంట్లు చేయలేదని వర్మ ట్వీట్ చేసాడు. తనకు సలహా ఇచ్చేముందు ఆలోచించుకోవాలని నాగబాబుకు చురక అంటించాడు. జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ నాగబాబుకు తనకు సలహాలిచ్చే స్థాయిలో లేనన్నాడు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో సోదరుడికి తప్పుడు సలహా ఇచ్చి ఓటమిపాలయ్యేలా చేశావో రాష్ట్రం మొత్తానికీ తెలుసని నాగబాబుపై వర్మ విరుచుకుపడ్డాడు.. నాగబాబు ఎక్కువ మాట్లాడితే తాను అంతకంటే ఎక్కువగా ట్వీట్లు చేస్తానని, నాగబాబుకన్నా తనకు ఎక్కువ విషయాలు తెలుసని వర్మ హెచ్చరించాడు. ఖైదీ నెంబర్ 150 ట్రైలర్ అద్భుతంగా ఉందని, అవతార్ కంటే బాగుందని, ఒకసారి చూడాలని నాగబాబుకు వర్మ సలహా ఇచ్చాడు.

English summary

Ram Gopal Varma Shocking Comments On Nagababu